కర్నూలు(సెంట్రల్): జిల్లాలో గంజాయి సాగు, మత్తు పదార్థాల రవాణా, వినియోగాన్ని సమష్టి కృషితో నిర్మూలిద్దామని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా అధికారులకు పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నార్కోటిక్స్ కోఆర్డినేషన్(ఎన్‌సీఓఆర్‌డీ) సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలతో కలిగే అనార్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మత్తు పదార్థాల వినియోగం, రవాణాపై ప్రజలు కూడా సమాచారం అందించాలని కోరారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనార్థాలపై పాఠశాలల్లో వ్యాసరచన, వక్తృత్వ పోఈలను నిర్వహించాలన్నారు. ప్రజలకు అవగాహన కోసం ర్యాలీలు నిర్వహించాలని, ప్రతిజ్ఞలు చేయించాలని డీఈఓను కోరారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లాకల్యాణి, జిల్లా వ్యవసాయాధికారి వరలక్ష్మీ, డీఈఓ శామ్యూల్‌పాల్, ఆర్‌టీసీ ఆర్‌ఎం శ్రీనివాసులు, అదనపు మునిసిపల్ కమిషనర్ ఆర్‌ర్జీవీ కృష్ణ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్‌కుమార్ పాల్గొన్నారు.