నేడు నేర సమీక్ష సమావేశం
దుకాణానికో రేటు ఖరారు
● కర్నూలులో రూ.70 వేలు ఇవ్వాల్సిందేనని పట్టు
● మధ్యవర్తిత్వం చేసిన ఓ మంత్రి
● ప్రస్తుతానికి రూ.40వేలు చెల్లించేలా ఒప్పందం
● వ్యాపారాన్ని బట్టి కూడా వసూళ్లు ●
● ప్రతినెలా 10లోపు లావాదేవీల పూర్తి
కర్నూలు: ఉమ్మడి జిల్లాలోని మద్యం దుకాణాల్లో పోలీసుల మామూళ్ల దందా శృతి మించుతోంది. వ్యాపారం సాగుతుందా? లేదా అనే విషయంతో సంబంధం లేకుండా అన్ని చోట్టా వసూళ్ల పర్వం యథేచ్ఛగా సాగుతోంది. నెలకు దుకాణానికి రూ.40 వేలు, మరికొన్ని చోట్ల రూ.50 వేలు చొప్పున కప్పం కట్టాల్సిందేనంటూ అనధికారిక ఆదేశాలు జారీ చేస్తున్నారు. వచ్చిన మొత్తాన్ని వాటాలేసి పంచుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 225 మద్యం దుకాణాలు, 60 బార్లు ఉన్నాయి. వీటిలో 90 శాతం దుకాణాల్లో పోలీసులు మామూళ్లు వసూలు చేస్తున్నారు. నెలకు రూ.40 వేల చొప్పున ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. కర్నూలు అర్బన్‌లో 21, రూరల్‌లో 11 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఒక్కొక్క దుకాణానికి రూ.70 వేల చొప్పున ఇవ్వాలని ఓ పోలీసు అధికారి హుకూం జారీ చేయగా మద్యం సిండికేట్‌దారులు ఓ మంత్రిని ఆశ్రయించారు. వ్యాపారంలో ఎదురవుతున్న కష్టాల గురించి చెప్పుకున్నారు. దీంతో మంత్రి మధ్యవర్తిత్వం చేసి ఒక్కొక్క దుకాణానికి రూ.40 వేలు ఇచ్చేలా డీల్ కుదిర్చినట్లు వ్యాపారుల్లో చర్చ జరుగుతోంది. ఒక్క కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో ఉన్న 32 మద్యం దుకాణాలు, 18 బార్ల నిర్వాహకులు కలసి నెలకు రూ.20 లక్షల దాకా పోగేస్తున్నారంటే వసూళ్ల పర్వం ఏస్థాయిలో సాగుతుందో అర్థమవుతోంది.
వ్యాపారం బాగా సాగితే అదనపు వసూళ్లు
కోడుమూరు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో 15 మద్యం దుకాణాలు ఉన్నాయి. జిల్లాలోనే అత్యధిక వ్యాపారం జరిగే నాగలాపురం మద్యం దుకాణం నుంచి నెలకు రూ.లక్ష చొప్పున ఇవ్వాల్సిందేనంటూ ఓ అధికారి హుకూం జారీ చేసినట్లు వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇలా ఉమ్మడి కర్నూలు జిల్లాలో వందకు పైగా దుకాణాల్లో అత్యధిక వ్యాపారం జరుగుతుండటంతో వాటి నిర్వాహకుల నుంచి పోలీసులు అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. సిండికేట్ నిర్వాహకుల లెక్కల్లో ఏయే స్టేషన్‌కు ఎంత మొత్తం మామూళ్లు ఇస్తున్నారో పొందుపరచిన వివరాలపై ఇటీవల ఎకై ్సజ్ అధికారులు, మద్యం వ్యాపారుల మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.
ప్రతినెలా 10వ తేదీలోపే!
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వసూళ్ల దందా జోరుగా సాగుతోంది. ప్రతినెలా 10వ తేదీ లోపే వసూళ్ల ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. రెండు జిల్లాల్లో నెలకు రూ.కోటికి పైగా మామూళ్ల రూపంలో పోలీసులకు అందుతున్నట్లు వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చిన మొత్తాన్ని రెండు వాటాలు వేసి ఎస్‌హెచ్‌లు, ఆపై అధికారులు పంచుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. స్టేషన్, సబ్ డివిజన్ పరిధిలో ఉండే మద్యం దుకాణాల సంఖ్యను బట్టి మామూళ్లు ముట్టజెపుతున్నట్లు తెలుస్తోంది.
అధిక ధరలకు అమ్మకాలు
●పోలీసులను మామూళ్ల మత్తులో పెట్టి నిర్వాహకులు నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు.
● అధిక ధరలకు అమ్ముకునేందుకు రూరల్ ప్రాంతాల్లో బెల్టు షాపులకు మద్యాన్ని సరఫరా చేస్తున్నారు.
● ఈ క్రమంలో అర్బన్ ప్రాంతాల్లో దుకాణానికి నెలకు రూ.40 నుంచి రూ.50 వేలు, రూరల్ ప్రాంతాల్లో రూ.60 వేల నుంచి రూ.80 వేల దాకా మామూళ్ల రూపంలో పోలీసులు పోగేస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
● ప్రతి మద్యం దుకాణం నుంచి వాటి అనుబంధ బెల్టు షాపులకు క్వార్టర్‌పై ఉన్న ఎమ్మార్పీ కంటే రూ.20 నుంచి రూ.50 వరకు ఎక్కువ ధరకు వ్యాపారులు సరఫరా చేస్తున్నారు.
● బెల్టు దుకాణాల్లో జరిగే దందాను చూసీచూడనట్లు ఉండేందుకు వ్యాపారాన్ని బట్టి ప్రత్యేక ప్యాకేజీలు ఏర్పాటు చేసుకుని వసూలు చేస్తున్నట్లు సమాచారం.
కర్నూలు: జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో గురువారం నేర సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. గత నెలలో జరిగిన నేరాలతో పాటు పెండింగ్ కేసులపై ఎస్పీ విక్రాంత్ పాటిల్ సమీక్షించనున్నారు. ముందుగా ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కర్నూలు శివారులోని జగన్నాథగట్టుపై ఉన్న పోలీసు శిక్షణ కేంద్రంలో పోలీసు అధికారులకు ఫైరింగ్‌పై శిక్షణ, 10 గంటల నుంచి వ్యాస్ ఆడిటోరియంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు జిల్లాలోని పోలీసు అధికారులకు ఆదేశాలు అందాయి.