
‘ఉపాధి’లో రూ.1.74 లక్షల అవినీతి
● పీడీ వెంకటరమణయ్య
మంత్రాలయం: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరిగిన పనుల్లో రూ.1,74,469 అవినీతి జరిగినట్లు నిర్ధారించగా.. వాటిని వెంటనే రీకవరీ చేయించాలని డ్వామా పీడీ వెంకటరమణయ్య ఆదేశించారు. శుక్రవారం మంత్రాలయం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీడీఓ రాధ ఆధ్వర్యంలో 18వ విడత సామాజిక తనిఖీ బహిరంగ సమావేశం నిర్వహించారు. రికార్డులు సరిగ్గా లేనట్లు తేల్చారు. రూ.1,74,469 అవినీతి జరగగా రికవరీ చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు రూ.33వేలు అపరాధ రుసుం విధించినట్లు చెప్పారు. ఇందులో అడిషనల్ పీడీ మాధవీలత, ఏపీడీ లోకేశ్వర్, ఏపీఓ తిమ్మారెడ్డి, ఈసీ శ్రీనివాసులు సిబ్బంది పాల్గొన్నారు.