
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
● గోస్పాడులో 43.. కర్నూలులో 42
డిగ్రీలు నమోదు
కర్నూలు(అగ్రికల్చర్): భానుడి భగభగలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎండల తీవ్రతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. శనివారం గోస్పాడులో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటం గమనార్హం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎండవేడిమి అధికంగా ఉంటోంది. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయట తిరగలేని పరిస్థితి నెలకొంది.
ప్రాంతం ఉష్ణోగ్రత
గోనవరం 42.83
(పాణ్యం మండలం)
కోసిగి 42.7
సంజామల 42.7
బనగానపల్లె 42.62
ఆళ్లగడ్డ 42.44
నందికొట్కూరు 42.43
కర్నూలు 42