దేవనకొండ: గ్రామసభ కోసం వేసిన టెంటును తొలగిస్తూ విద్యుదాఘాతంతో కింద పడి ఒక యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన తెర్నెకల్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఉదయం గ్రామసభను నిర్వహించి రాత్రి 7:30 గంటల సమయంలో టెంటును తొలగిస్తున్నారు. ఈ క్రమంలో టెంటుపైభాగాన ఉన్న హెవీ విద్యుత్ లైన్‌కు గిరిపోగు ప్రతాప్ ప్రతాప్ (30) చేయి తగిలింది.
విద్యుదాఘాతంతో ఆ యువకుడు 12 అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా సీసీ రోడ్డుపై పడ్డాడు. తలకు బలమైన గాయాలు తగలడంతో దేవనకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. గిరిపోగు ప్రతాప్‌కు వివాహం కాలేదు. తల్లి మునెమ్మ, ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నారు.