
‘సేవ’కు పోటు.. జీవితాలపై వేటు!
నియోజకవర్గాల వారీగా
పనిచేసిన వలంటీర్లు ...
నియోజకవర్గం మొత్తం వలంటీర్లు
ఆదోని 1,073
ఆలూరు 1,383
కోడుమూరు 1,174
కర్నూలు 1,308
మంత్రాలయం 1,096
పాణ్యం 1,344
పత్తికొండ 1,310
ఎమ్మిగనూరు 1,382
మొత్తం: 10,070
రోడ్డున పడిన వలంటీర్లు
● దగా చేసిన కూటమి ప్రభుత్వం
● ఉగాది సాక్షిగా మాట నిలుపుకోని
నేతలు
● మొత్తం వ్యవస్థనే లేకుండా చేసిన వైనం
● చిరుద్యోగులతో రాజకీయం
కర్నూలు(అర్బన్): కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక్కొక్క హామీకి నీళ్లొదులుతోంది. అధికారంలోకి రాగానే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు అండ్ కో.. ఉన్న ఉద్యోగ్యులను కూడా వీధిన పడేస్తోంది. దేశానికే ఆదర్శగా నిలిచిన వలంటీరు వ్యవస్థకు రూపమే లేదని కూ టమి ప్రభుత్వం కూల్చేసింది. గత ప్రభుత్వంలో అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను అర్హులైన పే ద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు పారదర్శకంగా ఇళ్ల వద్దకు చేర్చిన వలంటీర్లపై కూటమి ప్రభుత్వం కక్షకట్టింది. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటీరు వ్యవస్థను కొనసాగిస్తామని, పారితోషకాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని నమ్మబలికింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు వలంటీరు వ్యవస్థపై ఎటూ తే ల్చలేక, చివరకు ఈ వ్యవస్థకు చట్టబద్ధత లేదని తేల్చేసింది. ‘వలంటీరు వ్యవస్థే లేనప్పుడు ఎలా కొనసాగిస్తామని, లేని పిల్లాడికి ఏమి పేరు పెట్టాలన్నట్లు ఉందని ’ సాక్షాత్తూ మంత్రి డోలా వీరాంజనేయస్వామి చేత శాసనమండలిలో చెప్పించడం గమనార్హం.
కొనసాగుతున్న పోరాటాలు ...
ఐదేళ్లు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా సేవలు అందించిన తమను తిరిగి కొనసాగించాలని, ఇచ్చిన మాట ప్రకారం పారితోషకాన్ని రూ.10 వేలకు పెంచాలని వలంటీర్లు పోరాటాలను కొనసాగిస్తూనే ఉన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయి సంఘాలుగా ఏర్పడి ఉద్యమాన్ని బలోపేతం చేస్తున్నారు. వీరి ఉద్యమాలకు కామ్రేడ్లు కూడా తోడు కావడంతో ఉద్యమ్యం ఉద్ధృతమవుతోంది.
నమ్మించి గొంతు కోశారు
వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, వీరి సేవలను ఉపయోగించుకుంటాం, నెలకు రూ.10 వేలు పారితోషకం అందిస్తామని నమ్మించి గొంతు కోశారు. తక్కువ వేతనమైనా, సొంత గ్రామంలో ఉపాధి లభించడంతో పాటు అనేక మంది సొంత గ్రామస్తులకు సేవలు అందిస్తున్నామనే తృప్తి ఉండేది. అలాంటి మాపై ప్రభుత్వం కక్షతో వ్యవహరించడం సమంజసం కాదు.
– హమీద్, ప్యాలకుర్తి, కోడుమూరు మండలం
తెల్లవారక ముందే అవ్వా, తాతలను నిద్రలేపి
నిస్వార్థంగా పెన్షన్లు అందించిన వలంటీర్ల సేవలను
రాజకీయ స్వార్థం కబళించింది.
నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల పిల్లల చదువులకు
అవసరమైన సర్టిఫికెట్లను ఇంటి ముంగిళ్లలోనే అందించిన
వారిపై వేటు పడింది.
గత ప్రభుత్వం అందించిన అనేక సంక్షేమ పథకాలను ఎలాంటి
లాభాపేక్ష లేకుండా అతి తక్కువ గౌరవ వేతనంతో అనేక రకాల
సేవలు అందించిన వలంటీర్లపై కూటమి ప్రభుత్వం కరుణ చూపాల్సింది
పోయి కాఠిన్యం ప్రదర్శించింది.
కరోనా కష్టకాలంలో సొంత కుటుంబ సభ్యులు కూడా వారి వద్దకు
వెళ్లలేని పరిస్థితుల్లో తమ ప్రాణాలను లెక్క చేయకుండా సేవలందించిన
వలంటీర్ల జీవితాలనే ఈ ప్రభుత్వం కూల్చేసింది.

‘సేవ’కు పోటు.. జీవితాలపై వేటు!