యోగా అవార్డులకు నామినేషన్ల ఆహ్వానం
కర్నూలు(హాస్పిటల్): పీఎం యోగా అవార్డులు ఇచ్చేందుకు ఆన్‌లైన్ ద్వారా నామినేషన్లు, ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లు సెట్కూరు సీఈఎ డాక్టర్ కె.వేణుగోపాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. యోగాలో జాతీయ, అంతర్జాతీ య స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి, యోగా అభివృద్ధికి కృషి చేసిన సంస్థలకు అవార్డులు ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పూర్తి వివరాలకు https:// innovateindia. mygov. in/ pm& yoga& awards–2025 ను సందర్శించాలన్నారు.
క్వింటా పత్తి రూ.7,666
ఆదోని అర్బన్: ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో పత్తి ధర క్రమంగా పెరుగుతోంది. బుధవారం క్వింటా ధర రూ.7,666గా నమోదైంది. రైతులు 517 క్వింటాళ్లు అమ్మకానికి తీసుకురాగా.. గరిష్ట ధర రూ.7,666, మధ్య ధర రూ.7,380, కనిష్ట ధర రూ.5,389 పలికింది.
● వేరుశనగలు 5,100 సంచులు విక్రయానికి రాగా.. గరిష్ట ధర రూ.6,827, మధ్య ధర రూ. 6,469, కనిష్ట ధర రూ.3,399 నమోదైంది.
● ఆముదాలు 32 సంచులు రాగా గరిష్ట ధర రూ.5,970, మధ్య ధర రూ.5,970, కనిష్ట ధర రూ.5,077 పలికింది.
● ఎండుమిర్చి 2,057 సంచులు రాగా గరిష్ట ధర రూ.10,206, మధ్య ధర రూ.8,300, కనిష్ట ధర రూ.2,009 నమోదైంది.
మధ్యవర్తిత్వంపై శిక్షణ
కర్నూలు(సెంట్రల్): సుప్రీంకోర్టు నూతనంగా ప్రవేశపెట్టిన మధ్యవర్తిత్వంపై బార్ అసోసియేషన్ సభ్యులకు శిక్షణ ఇచ్చారు. బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కబర్థి ఆదేశాలతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి, కేరళ నుంచి వచ్చిన రిసోర్స్‌పర్స్‌న్‌లు సురేష్, జ్యోతిగోపీనాథన్ న్యాయవాదులకు అవగాహన కల్పించా రు. మధ్యవర్తిత్వంతో కేసులను ఎలా పరిష్కరించాలనే అంశాలు, ఉన్న చట్టాలపై శిక్షణ ఇచ్చారు.
పది పరీక్ష కేంద్రాల తనిఖీ
కర్నూలు సిటీ: నగరంలోని పదోతరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తనిఖీ చేశారు. బిషప్ సెంట్ జోసెఫ్ ఇంగ్లిషు మీడియం హైస్కూల్, గుడ్ షెప్పర్డ్ ఇంగ్లిషు మీడియం హైస్కూల్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 172 పరీక్ష కేంద్రాల్లో బుధవారం జరిగిన పదో తరగతి పరీక్షలకు 219 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 31,535 మంది విద్యార్థులకుగాను 31,316 మంది హాజరు అయ్యారని డీఈఓ ఎస్. శామ్యూల్ తెలిపారు. రెండో రోజు ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు. ఓపెన్ స్కూల్ టెన్త్ పరీక్షలకు 809 మంది విద్యార్థులకుగాను 721 మంది పరీక్షకు హాజరుకాగా 88 మంది గైర్హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment