ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు
కర్నూలు సిటీ: జిల్లాలోని 172 కేంద్రా ల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. శుక్రవారం మొత్తం 31,686 మంది విద్యార్థులకుగాను 31,393 మంది హాజరుకాగా.. 293 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఈఓ ఎస్.శ్యామూల్ పాల్ తెలిపారు. ఒపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షలకు 821 మందికిగాను 728 మంది విద్యార్థులు హాజరు కాగా.. 93 మంది గైర్హాజరయ్యారు.
బ్యాంకుల సమ్మె వాయిదా
కర్నూలు(అగ్రికల్చర్): ఈ నెల 24, 25 తేదీల్లో చేపట్టనున్న బ్యాంకుల సమ్మె వాయిదా పడింది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ పిలుపు మేరకు ఈ నెల 24, 25 తేదీల్లో బ్యాంకుల సమ్మెకు అన్ని బ్యాంకు యూనియన్‌లు సిద్ధమయ్యాయి. శుక్రవారం ఉన్నతస్థాయిలో ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ ప్రతినిధులు చర్చలు జరిపారు. అందులో భాగంగా రెండు నెలల సమయం ఇస్తే డిమాండ్‌లపై సానుకూలంగా చర్యలు తీసుకుంటామని కోరినట్లు జిల్లా కన్వీనర్ నాగరాజు తెలిపారు. ఇందుకు అనుగుణంగా రెండు రోజుల సమ్మెను వాయిదా వేసినట్లు ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment