ఎకై ్సజ్ శాఖలో ఎస్‌ఐల పదోన్నతికి దేహదారుఢ్య పరీక్ష
కర్నూలు: ఎకై ్సజ్ శాఖ ఫోర్త్ జోన్ పరిధిలో ఎస్‌ఐ పోస్టుల భర్తీకి అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. సీమ జిల్లాల్లో 52 ఎస్‌ఐ పోస్టులు ఖాళీగా ఉండగా 48 పోస్టులను హెడ్ కానిస్టేబుళ్లు, క్లర్కులకు అడ్‌హాక్ పద్ధతిలో పదోన్నతి కల్పించి పోస్టింగులు కేటాయించాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ఎకై ్సజ్ కార్యాలయ ఆవరణలోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్లకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. రాయలసీమ జిల్లాల నుంచి 17 మందికి గాను 16 మంది హాజరయ్యారు. వారికి బరువు, ఎత్తు, ఛాతీ కొలతలను తీసుకున్నారు. వీరంతా అర్హత సాధించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, లీగల్ మెటరాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ రాములు, జిల్లా ఎకై ్సజ్ అధికారి సుధీర్ బాబు, ఏఈఎస్ రాజశేఖర్ గౌడ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఈఎస్ రామకృష్ణ, సీఐలు రాజేంద్రప్రసాద్, చంద్రహాస్ తదితరులు పాల్గొన్నారు.
●16 మంది జూనియర్ అసిస్టెంట్లు ఉత్తీర్ణత
Comments
Please login to add a commentAdd a comment