మెడికల్ షాపుల్లో ‘ఆపరేషన్ గరుడ’
కర్నూలు: ఆపరేషన్ గరుడలో భాగంగా డీజీపీ ఆదేశాల మేరకు ఐజీ ఈగల్ టీమ్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ లోకల్ పోలీస్, డ్రగ్స్ కంట్రోల్ టీమ్ ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో మెడికల్ షాపులు, ఏజెన్సీల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ ఎస్పీ ఆదేశాల మేరకు అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి కర్నూలు, నంద్యాల, ఆదోని ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం పొద్దుపోయేదాకా విస్తృత తనిఖీలు నిర్వహించారు. దుకాణం లైసెన్స్, నిల్వలకు సంబంధించిన రిజిస్టర్లతో పాటు ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయాలు జరుపుతున్న విషయాలపై పరిశీలన జరిపారు. దాదాపు 20కి పైగా దుకాణాల్లో తనిఖీలు చేయగా కొన్నింటిలో నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. అలాగే భౌతిక నిల్వలకు రికార్డులో పొందుపరచిన నిల్వలకు తేడాలు ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment