గుర్తు తెలియని వాహనం ఢీకొని..
వెలుగోడు: మోత్కూరు గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మోత్కూరు గ్రామానికి చెందిన గుండెపోగు ఏసేపు కుమారుడు అశోక్(28) బైక్‌పై వెలుగోడుకు వస్తుండగా మార్గమధ్యలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు వెలుగోడులోని ఓ మందుల దుకాణంలో పని చేస్తున్నాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ద్వారా వెలుగోడుకు చెందిన వాహనం బైక్‌ను ఢీకొట్టినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment