రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు.
వైద్యులకు ఏఐ
ఎంతో ఉపయోగం
కర్నూలు(హాస్పిటల్): రోగులకు వైద్య సేవలు అందించడంలో వైద్యులకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) ఎంతో ఉపయోగపడుతుందని కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ అన్నారు. శనివారం కళాశాలలోని కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో ‘ప్రజారోగ్య రీసెర్చ్‌లో కృత్రిమ మేధస్సు పాత్ర’ అనే అంశంపై ఇంటర్నీస్, పీజీ విద్యార్థులతో సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ మాట్లాడుతూ.. వైద్యరంగంలో ఇమేజింగ్ టెక్నాలజీ, డేటా అనలైజేషన్ మొదలైన విభాగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మంచి ఫలితాలు ఇస్తోందన్నారు. రాబోయే కాలంలో ప్రజారోగ్యానికి అవసరమయ్యే ఏఐని ఉపయోగించుకుని చక్కటి ప్రణాళికలు రూపొందించుకోవచ్చని చెప్పారు. కమ్యూనిటీ మెడిసిన్ హెచ్‌వోడీ డాక్టర్ పి. సుధాకుమారి మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో తక్కువ సమయంలో లక్షలాది మంది రోగుల డేటాను అనలైజ్ చేయవచ్చన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌కు అవసరమైన మేరకు ఉపయోగించుకోవాలని, ప్రతి దానికీ దాని మీదే ఆధారపడితే వైద్యులకు, రోగులకు మధ్య హ్యూమన్ టచ్ మిస్ అవుతుందని కొందరు అన్నారు. ఏఐలో డేటా, సాంకేతిక తేడాలు వస్తే ఫలితాలు కూడా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. సెమినార్‌లో ప్రొఫెసర్ డాక్టర్ సింధియా శుభప్రద, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డీసీహెచ్‌ఎస్‌లు డాక్టర్ స్వర్ణకుమారి, డాక్టర్ రవినాయక్, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ పుష్పలత, డాక్టర్ ప్రవీణ, డాక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైల దేవస్థానానికి
భారీగా విరాళాలు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానానికి పలువురు భక్తులు భారీగా విరాళాలు సమర్పించారు. శనివారం రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌కు చెందిన కనకదుర్గ అన్నప్రసాద వితరణకు రూ.2,00,232 విరాళాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి జి.స్వాములకు అందజేశారు. అలాగే నెల్లూరుకు చెందిన బి.పల్లవి ప్రాణధాన ట్రస్ట్‌కు రూ.1,00,011, గోసంరక్షణనిధి పథకానికి బి.మౌనిక రూ.1,00,011, అన్నప్రసాద వితరణకు యామిని సురేష్ రెడ్డి రూ.1,00,011, అన్నప్రసాద వితరణకు బసిరెడ్డి శ్రీనివాసరెడ్డి రూ.1,00,011, గో సంరక్షణ నిధి పథకానికి బసిరెడ్డి సాయిచరణ్ రూ.1,00,011 విరాళాన్ని అందజేశారు. ఆయా విరాళాలను క్యూలైన్ల సహాయ కార్యనిర్వహణాధికారి జి.స్వాములుకు అందజేశారు. విరాళాలు అందించిన దాతలకు దేవస్థానం తరుఫున స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను, జ్ఞాపికలను అందించి సత్కరించారు.
రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
Comments
Please login to add a commentAdd a comment