చంద్రబాబుకు తొత్తుగా మందకృష్ణ మాదిగ
● మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి
కర్నూలు(టౌన్): మరుగున పడిన ఎస్సీ వర్గీకరణను ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి యూపీఏ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఉషా మెహ్రా కమిషన్ వేయించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు మాదిగ జాతికి ప్రతినిధిగా చెప్పుకునే మందకృష్ణ మాదిగ చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్నారన్నారు. రాజకీయ పదువుల్లో కూడా రాష్ట్రంలో ముగ్గురు మాదిగ కులస్థులకు జిల్లా పరిషత్ చైర్మన్ పదువులు ఇచ్చి గౌరవం కల్పించిన ఘనత దివంగత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి ప్లీనరీలోనే ఎస్సీ వర్గీకరణ అంశంపై తీర్మానం చేశారన్నారు. 30 ఏళ్లకు పైగా పోరాటంలో మాదిగలకు సుప్రీం కోర్టు తీర్పు వల్ల న్యాయం జరుగుతుందని, దీన్ని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందన్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికై నా రెండు కళ్ల సిద్ధాంతం మానుకోవాలని, సుప్రీం కోర్టు తీర్పు లేకపోతే ఆయన ఎప్పటికీ వర్గీకరణకు ఆమోదం తెలిపేవాడు కాదన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధనలో అమరులైన ఏడుగురికి రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా ఇప్పించాలని మందకృష్ణను డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment