
అపరిచితుడు సీఎం రేవంత్‌రెడ్డి
మహబూబాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి అపరిచితుడిలా మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షరాలు మాలోత్ కవిత అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి ‘కాంగ్రెస్ పా ర్టీ 420 హామీలు.. 420రోజుల మోసపూరిత పాలన’ పేరిట వినతిపత్రం సమర్పించి నిరసన తెలిపారు. ఈసందర్భంగా కవిత మాట్లాడుతూ.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కార్యక్రమం నిర్వహించామన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కరోనా సమయంలో కూడా రైతులకు రైతుబంధు ఇచ్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌దేనన్నారు. బతుకమ్మ చీరలు ఇవ్వకుండా చేనేత కార్మికులకు ఉపాధి లేకుండా చేశారని, దీంతో వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో 420 బూటకపు హామీలను ఇచ్చి, ఇప్పుడు అమలు చేయడం లేదన్నారు. మార్నేని వెంకన్న, భరత్‌కుమార్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ముత్యం వెంకన్న, ము రళీధర్‌రెడ్డి, ఫరీద్, రఘు, అశోక్, సలీం ఉన్నారు.
మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్
జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత
Comments
Please login to add a commentAdd a comment