
భద్రకాళీనగర్‌లో చోరీ
హసన్‌పర్తి: 56వ డివిజన్ గోపాలపురం భద్రకాళీ నగర్‌లో చోరీ జరిగింది. దుండగులు రెండిళ్లలో సుమారు 26 తులాల బంగారు ఆభరణాలు, రూ. లక్ష నగదుతో పాటు తొమ్మిది లక్షల విలువైన బాండ్లు ఎత్తుకెళ్లారు. ఈ రెండు చోరీలు ఒకే కాలనీలో జరిగాయి. పోలీసుల కథనం ప్రకారం.. భద్రకాళీనగర్‌కాలనీకి చెందిన పాతి ధర్మయ్య, స్రవంతి దంపతులు ప్రభుత్వ అధ్యాపకులు. ధర్మయ్య ఖమ్మంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, స్రవంతి ఐనవోలులోని కస్తూర్బాలో విధులు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం ధర్మయ్య ఖమ్మం, స్రవంతి ఐనవోలు వెళ్లారు. అరోజు రాత్రి ఖమ్మంలో జరిగిన బంధువుల పెళ్లికి ధర్మయ్య హాజరయ్యాడు. ఇంటర్ పరీక్ష ఉండడంతో స్రవంతి ఐనవోలులోనే ఉంది. బుధవారం ఉదయం ఇద్దరూ ఇంటికి వచ్చారు. తలుపు తాళాలు ధ్వంసమై కనిపించాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న సుమారు 20 తులాల బంగారం, రూ.లక్ష నగదుతోపాటు తొమ్మిది లక్షల రూపాయల విలువైన బాండ్ల మాయమయ్యాయి. అలాగే, అదే కాలనీకి చెందిన ఆకుల వెంకటేశ్వర్ల ఇంటిలో కూడా చోరీ జరిగింది. ఆరుతులాల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. నాలుగు నెలల క్రితం వెంకటేశ్వర్లు దంపతులు అమెరికాకు వెళ్లారు. విషయం తెలియగానే హైదరాబాద్‌లో ఉంటున్న వెంకటేశ్వర్ల కూతురు హుటాహుటిన గోపాలపురానికి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకుని సీసీ ఫుటేజీ పరిశీలించారు అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ఇన్‌స్పెక్టర్ సుంకరి రవికుమార్ తెలిపారు.
26 తులాల బంగారు ఆభరణాలు,
రూ. లక్ష నగదు మాయం
Comments
Please login to add a commentAdd a comment