
మానవ మేధస్సుతోనే అద్భుతాలు
కేయూ క్యాంపస్: మానవమేధస్సుతోనే అద్భుతా లు సృష్టించగలమని, కృత్రిమ మేధాను ఒక టూల్‌గా వినియోగించుకోవాలని కాకతీయ యూనివర్సి టీ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి అన్నారు. బుధవారం కేయూలోని కామర్స్ అండ్ బిజినెస్‌మేనేజ్ మెంట్ కళాశాల ఆధ్వర్యంలో ఇండియన్ అకౌంటింగ్ అసోసియేషన్ సహకారంతో రెండు రోజుల జాతీయ సదస్సు ప్రా రంభ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నా రు. ‘న్యూ హారిజన్స్ ఇన్‌కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ డ్యూరింగ్ 21 ఫస్ట్ సెంచరీ చాలెంజెస్ అండ్ ఆపార్చునిటీస్’ అనే అంశంపై వీసీ ప్ర తాప్‌రెడ్డి మాట్లాడుతూ మార్పు సహజమని, అయి తే టెక్నాలజీలో వస్తున్న మార్పులు వినియోగదారుడికి లాభకారిగా ఉండాలేగాని మోసగించేలా ఉండొద్దన్నారు. ఎస్‌బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఘన్‌శ్యాంసోలంకి మాట్లాడుతూ వినియోగదారుడు టె క్నాలజీ వినియోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఏపీలోని గుంటూరులోని నాగార్జున యూ నివర్సిటీ కామర్స్ విభాగం డీన్ కె. శివరామ్ మా ట్లాడుతూ కృత్రిమ మేధా నేపథ్యంలో వ్యాపార వ్యవహారాల్లో విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయన్నారు. ఓయూ రిజిస్ట్రార్ జి. నరేశ్‌రెడ్డి, ఇండియన్ అకౌంటింగ్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షుడు వి. అప్పారావు, వరంగల్ జెన్‌పాక్ట్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ రమేశ్, ఇండియన్ అకౌంటింగ్ అ సోసియేషన్ ప్రధాన కార్యదర్శి సంజయ్ బయ్యని, సెమినార్ డైరెక్టర్ అమరవేణి మాట్లాడారు. ఈ సదస్సులో కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, సీడీసీ డీన్ పి.వరలక్ష్మి, ఎస్. నర్సింహాచారి, సదస్సు కన్వీనర్ ఫణీంద్ర, కోకన్వీనర్ బి. ప్రగతి తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సులో 70 పరిశోధన పత్రాల సమర్పించబోతున్నారు. నేటి సాయంత్రం ఈ సదస్సు ముగియనుంది.
కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment