
అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్
నయీంనగర్: రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులకు కచ్చితంగా అక్రిడిటేషన్ కార్డులు దక్కేలా తమ సంఘం కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ భరోసా ఇచ్చారు. శనివారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు గడ్డం రాజిరెడ్డి అధ్యక్షతన హనుమకొండ, వరంగల్ జిల్లాల కార్యవర్గ సమావేశంలో విరాహత్ అలీ మాట్లాడారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ల విషయంలో కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో సీనియర్ పాత్రికేయులతో కూడిన కమిటీ నాలుగైదుసార్లు సమావేశమై కొత్త నిబంధనలు రూపొందించిందని, ఈ నేపథ్యంలో అక్రిడిటేషన్ల జారీలో జాప్యమైందని స్పష్టం చేశారు. జర్నలిస్టుల ఆరోగ్య పథకం, ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే డిమాండ్‌తో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) పోరాడుతోందన్నారు. ఇటీవల ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రులకు విన్నవించామని, ప్రభుత్వ ఉద్యోగులతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా జేహెచ్‌ఎస్ ప్రారంభించాలని కోరగా వారు సానూకూలంగా స్పందించారని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంనారాయణ, ఉపాధ్యక్షుడు గాడిపెల్లి మధు, వరంగల్, హనుమకొండ జిల్లాల బాధ్యులు ఎ.రాంచందర్, తోట సుధాకర్, దుర్గా ప్రసాద్, సీనియర్ నాయకులు దాసరి కృష్ణారెడ్డి, కంకణాల సంతోశ్, పి.వేణుమాధవ్, గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య తదితరులు పాల్గొన్నారు.
టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ
Comments
Please login to add a commentAdd a comment