బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో క్రీడలు నిర్లక్ష్యం
వరంగల్ స్పోర్ట్స్ : బీఆర్‌ఎస్ ప్రభుత్వం క్రీడలను నిర్లక్ష్యం చేస్తే, స్వయంగా క్రీడాకారుడైన సీఎం రేవంత్‌రెడ్డి క్రీడల అభ్యున్నతికి నిధులు కేటాయిస్తున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర 10వ టెన్నికాయిట్ చాంపియన్‌షిప్ పోటీలు శనివారం హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల ప్రారంభానికి ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం కప్ క్రీడాపోటీలు ఘనంగా నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారుల్లో నూతనోత్తేజం తీసుకొచ్చామన్నారు. క్రీడల అభివృద్ధి, క్రీడాకారుల సంక్షేమం కోసం తామెప్పుడు ముందుంటామన్నారు. టెన్నికాయిట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పీఎన్. వెంకటేశ్ మాట్లాడుతూ నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తున్న పోటీల్లో రాష్ట్రం నుంచి 300 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో ఒలింపిక్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎండి. అజీజ్‌ఖాన్, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, సాట్ కోచ్ సద్గురు, టెన్నికాయిట్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ బీఆర్ అంబేడ్కర్, హనుమకొండ, వరంగల్ జిల్లాల కార్యదర్శులు అలువాల రాజ్‌కుమార్, గోకారపు శ్యాంకుమార్, కోశాధికారి జాహుర్, టెక్నికల్ అఫిషియల్స్ వై. సురేందర్, సలహాదారులు కె. జితేందర్‌నాథ్, జి. రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment