మరమ్మతుల్లో చెరువులు, చెక్ డ్యాములు
గత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 55 చెరువు కట్టలు కొట్టుకుపోయాయి. 72 చెరువులకు గండ్లు పడ్డాయి. వీటితోపాటు, ఆకేరు, మున్నేరు, పాలేరు వాగులపై నిర్మించిన 42 చెక్ డ్యాముల్లో సగం మేరకు దెబ్బతిన్నాయి. రోడ్లు ధ్వంసం అయ్యాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతోపాటు కేంద్ర బృందం ఈ ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేశారు. తాత్కాలిక మరమ్మతుల పేరిట కొన్ని నిధులు మంజూరు చేసినా.. అవి సగం పనులకు కూడా సరిపోలేదు. ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించి చెరువులు, చెక్ డ్యామ్‌ల మరమ్మతులు చేస్తేనే సాగునీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment