ప్రణాళిక ప్రకారం చదివితేనే విజయం
● గ్రూప్–1 టాపర్ తేజస్విని రెడ్డి
విద్యారణ్యపురి: ప్రణాళిక ప్రకారం కష్టపడి చదివి తేనే పోటీ పరీక్షల్లో విజయం సాధ్యమని గ్రూప్ –1 టాపర్ జిన్నా తేజస్విని రెడ్డి అన్నారు. మంగళవా రం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెరీర్ గైడెన్స్ కౌన్సెలింగ్ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో తేజ స్వినిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సరైన ప్రణాళికతో సొంతంగా నోట్స్ రాసుకోవాలన్నారు. పోటీ పరీక్షల్లో తమకు ఏ సబ్జెక్ట్‌పై ఆసక్తి ఉందో దానిపైపట్టు సాధించేలా అందుకు సంబంధించిన పుస్తకాలు చదవవాలన్నారు. శాస్త్ర,సాంకేతిక అంశాలపై శిక్షణ నిపుణలు చల్లా నారాయణరెడ్డి, ఆ కళాశాల ప్రిన్సిపాల్ జి. రాజారెడ్డి, వైస్‌ప్రిన్సిపాల్ కె. రజనీలత, స్టాఫ్‌సెక్రటరీ ఎం. రవికుమార్,కెరీర్ అండ్ గైడెన్స్‌సెల్ కోఆర్డినేటర్ బి.కవిత, డాక్టర్ చి న్నా మాట్లాడారు. అనంతరం తేజస్వినిరెడ్డిని ప్రిన్సి పాల్ రాజారెడ్డి ఇతర అధ్యాపకులు సన్మానించారు.
విద్యుత్ మోటారు ఆన్ చేస్తూ.. మృత్యుఒడికి
● షాక్‌కు గురై రైతు మృతి
● కొండపర్తిలో ఘటన
ఐనవోలు: విద్యుత్ మోటారు ఆన్ చేస్తున్న క్రమంలో షాక్‌కు గురై ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని కొండపర్తిలో చోటు చేసుకుంది. ఎస్సై పస్తం శ్రీనివాస్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బాల్నె రమేశ్ (45) వ్యవసాయంతో పాటు కులవృత్తి (గౌడ) కల్లు తీస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజు మాదిరిగానే వరి పంటకు నీరు పారించడానికి మంగళవారం ఉదయం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో స్టార్టర్ ద్వారా వ్యవసాయ మోటారు ఆన్ ఆన్ చేస్తుండగా ఎడమ చేతికి విద్యుత్ తీగ తగిలి షాక్‌కు గురై పక్కనే ఉన్న నీటి కాల్వలో పడి అక్కడికక్కడే మృతిచెందాడు. చుట్టుపక్కల రైతులు గమనించి మృతుడి భార్య, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తన భర్త మృతి విషయంలో ఎవరిపై ఎలాంటి అనుమానం లేదని మృతుడి భార్య శోభారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
వెంకటాపురం(కె): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈఘటన మంగళవారం రాత్రి మండల కేంద్రంలోని దుర్గమ్మ గుడి సెంటర్‌లో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన రాజా(58) దుర్గమ్మ గుడి సెంటర్ నుంచి నడుచుకుంటూ అంబేడ్కర్ సెంటర్ వైపునకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నవాబ్ పేటకు చెందిన ఉదయ్ కిరణ్ (30) ద్విచక్రవాహనంపై వేగంగా వస్తూ రాజాను ఢీకొన్నాడు. దీంతో రాజా అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే, ద్విచక్రవాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టి కిందపడడంతో ఉదయ్ కిరణ్ కూడా అక్కడికక్కడే మృతి చెందాడు.
ప్రణాళిక ప్రకారం చదివితేనే విజయం
ప్రణాళిక ప్రకారం చదివితేనే విజయం
ప్రణాళిక ప్రకారం చదివితేనే విజయం
Comments
Please login to add a commentAdd a comment