ఆటో డ్రైవర్‌కు ఏడాది జైలు
జనగామ: ఆటోను అజాగ్రత్తగా నడిపి ఇద్దరి మృతికి కారణమైన డ్రైవర్‌కు జనగామ కోర్టు ఏడాది కఠిన కారాగార శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. సీఐ దామోదర్‌రెడ్డి కథనం ప్రకారం.. 2016లో నర్మెట మండలం కన్నెబోయినగూడెం నుంచి అదే గ్రామానికి చెందిన ధారావత్ టీక్యా, నర్మెటకు చెందిన శిరీష, ఆమె తల్లి కనకలక్ష్మితో పాటు మరో ఐదుగురు ఆటోలో జనగామకు బయలుదేరారు. లింగాలఘనపురం మండలం నెల్లుట్లకు చెందిన ఆటో డ్రైవర్ యోహాన్ అజాగ్రత్త, అతివేగం నడపడం వల్ల జనగామ మండలం గానుగుపహాడ్ దాటిన తర్వాత వాహనం పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో టీక్యా అక్కడికక్కడే మృతి చెందగా, కనకలక్ష్మికి తీవ్ర గాయాలు కావడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం తరలించే క్రమంలో మార్గమధ్యలో మృతి చెందింది. అప్పటి సీఐ ముస్కె శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా, అసిస్టెంట్ పీపీ కిరణ్ కుమార్ వాదించారు. కోర్టు కానిస్టేబుల్ టి.రవికుమార్, హెడ్ కానిస్టేబుల్ యాదగిరి సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా, ఇరువురి వాదనలు విన్న జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జి.శశి.. నిందితుడు యోహాన్‌కు ఏడాది కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించినట్లు సీఐ తెలిపారు.
నేడు మామిడి మార్కెట్ ప్రారంభం
వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్ పరిధి లక్ష్మీపురం ఫ్రూట్ మార్కెట్‌లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తున్నందున ఈ ఏడాది మామిడి సీజన్ నిర్వహణ కోసం ఏనుమాముల ముసలమ్మకుంట పక్కనే మార్కెట్ స్థలంలో మామిడి మార్కెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. గురువారం ఉదయం రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు ఈమార్కెట్‌ను ప్రారంభించనున్నట్లు వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి గుగులోతు రెడ్డి తెలిపారు. కాగా.. కరోనా సాకుతో నాలుగేళ్ల క్రితం ధర్మారంలోని ఓ ప్రైవేట్ గోదాంలో మామిడి మార్కెట్‌ను ఓపెన్ చేసి ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా వ్యాపారులు ఇన్నాళ్లు కొనసాగించారు. దీంతో మార్కెట్ కమిటీ పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోయింది. ముసలమ్మకుంట పక్కన మార్కెట్‌కు సంబంధించిన 10 ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు అధికారుల నుంచి అనుమతులు రావడంతో మంత్రి చేతుల మీదుగా మామిడి మార్కెట్‌ను ప్రారంభిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment