ఒకే దేశం.. ఒకే ఎన్నికతోనే అభివృద్ధి
మహబూబాబాద్ అర్బన్: ఒకే దేశం ఒకే ఎన్నికతోనే దేశాభివృద్ధి సాధ్యమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఒకే దేశం–ఒకే ఎన్నిక అనే అంశంపై సమావేశం నిర్వహించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. జమిలి ఎన్నికలు నిర్వహిస్తే వ్యయం తగ్గుతుందన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న ప్రయత్నానికి ప్రతీ ఒక్కరు మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శ్యామ్‌సందర్‌శర్మ, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు వద్దిరాజు రామచంద్రరావు, నాయకులు గాదె రాంబాబు, కొనతం పెంటయ్య, చీకటి మహేశ్‌గౌడ్, పల్లె సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment