ఆరు గ్యారంటీలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం.. మహిళా పథకాలకు ప
అందరినోటా ఆరు గ్యారంటీలు..
కాంగ్రెస్ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చేర్చిన ఆరు గ్యారంటీ పథకాలకు ఈ బడ్జెట్‌లోనూ అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలో 8,77,173 మంది రైతులకు రైతుభరోసా పథకం ఈ ఏడాది కూడా అమలు కానుంది. ఒక కార్పొరేషన్, 9 మున్సిపాలిటీలు, 1,708 గ్రామపంచాయతీలుండగా మహాలక్ష్మి పథకం కింద సుమారు ప్రతి మహిళకు రూ.2.500 చొప్పున సుమారు 7.21 లక్షల మందికి అందే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సుల్లో వరంగల్ రీజియన్‌లో రోజుకు సగటున సుమారు 55 వేల మంది మహిళలు ఉచితంగా రాకపోకలు సాగించేందుకు ఢోకా లేదు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కనెక్షన్లపై రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకంలో 6,10,220 మంది లబ్ధిదారులకు కొనసాగనుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటికే 2.50 లక్షల మందిని రెవెన్యూ అధికారులు అర్హులుగా గుర్తించగా, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల లోపు కరెంట్ వాడిన 6,12,901 మందికి ఉచిత విద్యుత్ సౌకర్యం కలగనుంది.
Comments
Please login to add a commentAdd a comment