వేసవి దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి
మహబూబాబాద్: జిల్లాలో వేసవికాలం దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ ఆదేశించారు. కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో బుధవారం జిల్లాస్థాయి వాతావరణ మార్పుల టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వడదెబ్బ, ఎండ దెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఉపాధి హామీ పనుల వద్ద కూలీలు, మున్సిపల్, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పశుసంపద సంరక్షణకు తీసుకోవాల్సి జాగ్రత్తలను తెలియజేయాలన్నారు. అటవీశాఖ అధికారులు అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారి, ఆర్డీఓలు కృష్ణవేణి, గణేశ్, డీఆర్‌డీఓ మధుసూదన్ రాజు, డీఎంహెచ్‌ఓ మురళీదర్, మున్సిపల్ కమిషనర్లు నోముల రవీందర్, నరేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లక్ష్యాలు పూర్తి చేయాలి..
రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలు పూర్తిస్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో బుధవారం జిల్లాస్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పంట రుణాల పంపిణీకి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సబ్సిడీ రుణాల పంపిణీ విషయంలో జాప్యం చేయవద్దన్నారు. వీధి వ్యాపారులకు విరివిగా ముద్ర రుణాలతో పాటు స్టాండ్ ఆఫ్ ఇండియా రుణాలు అందించాలన్నారు. సమావేశంలో ఆర్‌బీఐ ఎల్‌డీఓ సాయి చరణ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ సత్యనారాయణ మూర్తి, నాబార్డు ఏజీఎం చంద్రశేఖర్, డీఏఓ విజయనిర్మల పాల్గొన్నారు.
కలెక్టర్ అౖద్వైత్‌కుమార్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment