వన్యప్రాణుల వేటకు వెళ్లి.. ఉచ్చుకు తగిలి
ఏటూరునాగారం: అటవీ జంతువులను వేటాడటానికి వెళ్లిన ఓ వ్యక్తి.. కరెంట్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని కొత్తగుడిసెల ప్రాంతానికి చెందిన తుమ్మ గంగయ్య(50), లొటపెటల నారాయణ, ఎద్దు లోకేశ్ కలిసి శుక్రవారం అర్ధరాత్రి చిన్నబోయినపల్లి అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడేందుకు వెళ్లారు. ముగ్గురు కలిసి 33 కేవీ విద్యుత్‌లైన్‌కు కరెంట్ ఉచ్చులు తగిలించే ప్రయత్నం చేశారు. ఇందులో గంగయ్య కర్ర పట్టుకుని కరెంట్ వైర్లకు ఉచ్చుకు అమర్చిన వైర్ తగిలిస్తుండగా విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన లోకేశ్, నారాయణ భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి వచ్చి కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శనివారం ఉదయం ఘటనా స్థలికి చేరుకుని అతడిని రెండు కిలోమీటర్ల మోసుకుంటూ బయటకు తీసుకొచ్చారు. దీనిపై సమాచారం అందుకున్న సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై తాజొద్దీన్ ఘటనా స్థలికి చేర్జుజీని క్షతగాత్రుడిని 108లో వరంగల్ ఎంజీఎం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతి చెందాడు. ఈ ఈ ఘటనలో లోకేశ్, లక్ష్మీనారాయణపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్, ఎస్సై తాజొద్దీన్ తెలిపారు. మృతుడికి భార్య రమ, ఇద్దరు కూతుళ్లు మౌనిక, అనిత ఉన్నారు.
కరెంట్ షాక్‌కు గురై వ్యక్తికి
తీవ్ర గాయాలు
చికిత్స పొందుతూ మృతి
Comments
Please login to add a commentAdd a comment