చెరువులో చేపలు పడుతుండగా..
రఘునాథపల్లి: చెరువులో చేపలు పడుతున్న ఐదుగురిని దొంగలుగా భావించి చెట్టుకు కట్టేసిన ఘటన శనివారం మండలంలోని గోవర్ధనగిరిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్ర కారం.. బిహార్‌కు చెందిన కొందరు కూలీలు గ్రామశివారులోని ఆ యిల్ కంపెనీలో పనులు చేస్తున్నారు. మధ్యాహ్న సమయంలో గ్రామ శివారులోని ఆనకుంటలో ఐదుగు రు కూలీలు చెరువులో చేపలు ప డుతున్నారు. కుంట చేపలను సంరక్షిస్తున్న కాంట్రాక్టర్లు వారిని దొంగలుగా భావించి తాడుతో చెట్టుకు కట్టేశారు. ఇటీవల వ్యవసాయ మోటార్ల కేబుల్ వైర్లు అపహరణ కు గురవుతుండంతో వీరి పనేగా భావించి, చెట్టుకు కట్టేసిన ఫొటోలు గ్రామ వాట్సాప్ గ్రూపులో పో స్ట్ చేశారు. అదే ఆయిల్ కంపెనీ లో పని చేసే స్థానికులు వారిని గు ర్తించి వారు బిహార్‌కు చెందిన కూలీలని, దొంగలు కాదని.. సరదాగా చేపలు పట్టేందుకు వచ్చారని వివరించడంతో వదిలేశారు.
దొంగలుగా భావించి బిహార్ కూలీలను చెట్టుకు కట్టేసిన కాంట్రాక్టర్లు
గోవర్ధనగిరిలో ఘటన
Comments
Please login to add a commentAdd a comment