ఇంటర్ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
హసన్‌పర్తి: తెలంగాణ రాష్ట గురుకుల విద్యాలయ సంస్థ పరిధిలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కో–ఆర్డినేటర్ కె. ఇందుమతి శనివారం తెలిపారు. 2025లో పదో తరగతి పరీక్షలకు హాజరైన బాలబాలికలు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఏప్రిల్ 23వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. వివరాలకు http:tgrjc.gov.in దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. వివరాలకు 040– 24734899, 9866559727 నంబర్లను సంప్రదించాలని జిల్లా కో–ఆర్డినేటర్ ఇందుమతి సూచించారు.
4వ తేదీన గిరిజన భవన్‌లో జాబ్‌మేళా
వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఏటూరునాగారం ఐటీడీఏ ఆధ్వర్యంలో వచ్చే నెల 4వ తేదీన ఉదయం 10 గంటలకు హనుమకొండలోని గిరిజన భవన్‌లో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్టు అధికారి చిత్రమిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, డి.ఫార్మసీ, ఎఎన్‌ఎం, జీఎన్‌ఎం, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్ చదవిన, ఆసక్తిగల గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులు తమ బయోడేటా, విద్యార్హత జిరాక్స్ ప్రతులతో సకాలంలో జాబ్‌మేళాకు హాజరుకావాలని పీఓ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment