వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య
మరిపెడ రూరల్: అప్పుల బాధతో ఓ వ్యక్తి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన శనివారం రాత్రి మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తయాయగూడెంలో చోటు చేసుకుంది. ఎస్సై సతీశ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వల్లందాసు సోమయ్య (50) గతంలో తన ఇద్దరు కుమార్తెల వివాహాలు జరిపించాడు. ఈ క్రమంలో సుమారు రూ.3 లక్షల వరకు అప్పుచేశాడు. అప్పు తీర్చే మార్గం కనబడలేదు. దీంతో మనస్తాపానికి గురై శనివారం వ్యవసాయ క్షేత్రం వద్ద గడ్డి మందు తాగాడ. అపస్మారక స్థితిలో పడి ఉన్న సోమయ్యను కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మాణిక్యాపురంలో యువకుడు..
లింగాలఘణపురం: మండలంలోని మాణిక్యాపురం గ్రామానికి చెందిన చిన్నం మహేశ్ (24) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్రావణ్‌కుమార్ తెలిపారు. మేసీ్త్ర పనితోపాటు వ్యవసాయం చేస్తున్న మహేశ్.. ఆదివారం వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే మహేశ్ ఆత్మహత్యకు కారణాలు తెలియలేదని ఎస్సై తెలిపారు.
పిల్లలు లేరనే మనస్తాపంతో
లక్ష్మీపూర్‌తండా గ్రామంలో వ్యక్తి..
చిట్యాల: అనార్యోగంతో పాటు పిల్లలు లేరనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన మండలంలోని లక్ష్మీపూర్‌తండా గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన భుక్యా నరసింహ(55), విమల దంపతులకు 30 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి వారికి పిల్లలు జన్మించలేదు. అలాగే, నరసింహ నాలుగు సంవత్సరాల నుంచి టీబీతో బాధపడుతున్నాడు. రెండు రోజులు నుంచి ఆరోగ్యం బాగా లేదని, తాను బతికి ఎవరికి ఉపయోగం, తనకు పిల్లలు లేకపాయే అని శనివారం తన భార్యతో చెప్పి బాధపడ్డాడు. ఈ క్రమంలో ఆదివారం ఆస్పత్రికి వెళ్దామని భార్య విమల చెప్పిగా ఇద్దరు రాత్రి నిద్రించారు. తెల్లవారుజామున విమల బయటకు వచ్చి చూడగా నరసింహ ఇంటి ఎదుట ఉన్న చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి కనిపించాడు. ఈ ఘటనపై మృతుడి భార్య విమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై శ్రావన్‌కుమార్ పేర్కొన్నారు.
వేర్వేరు కారణాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముగ్గురు ఆత్మహత్యలకు పాల్పడారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.
వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య
వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య