నేడు వీరభద్రస్వామి హుండీ లెక్కింపు
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి హుండీలను నేడు(మంగళవారం) లెక్కిస్తామని ఆలయ ఈఓ సత్యనారాయణ సోమవారం తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 26నుంచి ఈనెల 24వ తేదీ వరకు భక్తులు సమర్పించుకున్న కానుకలను లెక్కిస్తామన్నారు. ఆలయ అధికారులు సకాలంలో హాజరుకావాలని సూచించారు.
‘పది’ పరీక్ష కేంద్రం పరిశీలన
బయ్యారం: మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని డీఈఓ రవీందర్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దని, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. డీఈఓ వెంట గార్ల–బయ్యారం సీఐ రవికుమార్, ఎస్సై తిరుపతి, ఎంఈఓ దేవేంద్రాచారి తదితరులు ఉన్నారు.
ఉపాధి పనులు
పారదర్శకంగా చేపట్టాలి
● డీఆర్‌డీఓ మధుసూదన్‌రాజు
తొర్రూరు: ఉపాధి హామీ పనులను పారదర్శకంగా చేపట్టాలని, అవకతవకలకు చోటు ఇవ్వవద్దని డీఆర్‌డీఓ మధుసూదన్‌రాజు పేర్కొన్నారు. సోమవారం డివిజన్ కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధిహామీ పనులపై ప్రజా వేదిక కార్యక్రమం చేపట్టారు. ఎంపీడీఓ పూర్ణచందర్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజా వేదికలో 2023–24లో మండలంలోని ఆయా గ్రామాల్లో చేపట్టిన ఉపాధిహామీ పనులపై సమీక్ష నిర్వహించారు. ఉపాధి పనుల్లో అవకతవకలు గుర్తించిన అధికారులు రూ.1.62 లక్షల రికవరీకి ఆదేశించారు. 29 గ్రామాలకు సంబంధించిన ఈజీఎస్ సిబ్బంది ఉపాధిహామీ పనులకు సంబంధించిన నివేదికలను చదివి వినిపించారు. పలు గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు జాబ్‌కార్డులు, నో డిమాండ్, రికార్డుల నిర్వహణ సక్రమంగా చేయకపోవడం, మస్టర్ల వద్ద సంతకాలు తీసుకోకపోవడం వంటివి బహిర్గతమయ్యాయి. డీఆర్‌డీఓ మాట్లాడుతూ.. ఉపాధిహామీ పనుల్లో అవకతవకలు జరిగితే ఉపేక్షించబోమన్నారు. జాబ్ కార్డు కలిగిన పేదలకు ఉపాధి పని చూపించాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి సిబ్బందిపై ఉందన్నారు. కార్యక్రమంలో ఏపీఓలు మధు,పార్థసారథి, అంబుడ్స్‌మెన్ ఆడమ్, సిబ్బంది పుష్పలత, సురేంద్ర, చెన్నకేశవులు, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
నేడు వీరభద్రస్వామి హుండీ లెక్కింపు