‘డిగ్రీ’ ఉత్తీర్ణత అంతంతే.. | - | Sakshi
Sakshi News home page

‘డిగ్రీ’ ఉత్తీర్ణత అంతంతే..

Published Wed, Mar 26 2025 1:07 AM | Last Updated on Wed, Mar 26 2025 1:19 AM

‘డిగ్రీ’ ఉత్తీర్ణత అంతంతే..

‘డిగ్రీ’ ఉత్తీర్ణత అంతంతే..

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీలో ఒకప్పుడు వార్షిక ఫలితాల విధానం ఉండేది. సంవత్సరం మొత్తం పాఠాలు చెప్పిన తర్వాత పరీక్షలు నిర్వహించే వారు. అనంతరం ఫలితాలు ప్రకటించేవారు. అయితే ఇందులో విద్యార్థులు తక్కువ ఉత్తీర్ణత సాధించేవారు. దీంతో ఈ విధానాన్ని రద్దు చేసి కొన్ని సంవత్సరాల క్రితం సెమిస్టర్‌ సిస్టంను తీసుకొచ్చారు. అయినా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించలేకపోతున్నారు. సెమిస్టర్‌ విధానంలో ఉదాహరణకు ఒక సబ్జెక్టుకు 100 మార్కులు ఉంటే అందులో 20 ఇంటర్నల్‌ మార్కులు ఉంటాయి. ఇక ప్రతీ సబ్జెక్టుకు 80 మార్కుల సెమిస్టర్‌ పరీక్ష ఉంటుంది. అందులో వచ్చిన మార్కులు, ఇంటర్నల్‌లో వచ్చిన మార్కులు కలిపే ఉత్తీర్ణత ప్రకటిస్తారు. అయినా ఈ విధానం వల్ల వివిధ సబ్జెక్టుల్లో పాస్‌ మార్కులు కూడా రాక వేలాది మంది విద్యార్థులు ఫెయిల్‌ అవుతున్నారు. ప్రతీ సెమిస్టర్‌ పరీక్షల్లోనూ అప్పటివరకు పూర్తయిన పాఠ్యాంశాల నుంచే ప్రశ్నలు వస్తాయి. కొద్దిపాటిగా చదువుకున్నా ఉత్తీర్ణత సాధించే పరిస్థితి ఉంటుంది. ఎక్కువ మార్కులు రావాలంటే కొంచెం కష్టపడాల్సిందే. కేయూ పరిఽధిలో ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌, గురుకులాలు డిగ్రీ కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, ‘బి’ ఒకేషనల్‌, ‘బి’ ఎస్‌సీ హానర్స్‌ కోర్సుల్లో నిర్వహించిన డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్‌ పరీక్షలతోపాటు రెండో సంవత్సరం మూడో సెమిస్టర్‌, ఫైనల్‌ ఇయర్‌ ఐదో సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలను కొద్దిరోజుల క్రితం అధికారులు ప్రకటించారు.ఈ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం అంతంతమాత్రంగానే ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

సెమిస్టర్‌ సిస్టంలోనూ మెరుగైన ఫలితాలేవి?

డిగ్రీ కోర్సుల సెమిస్టర్‌ సిస్టంలో విద్యార్థులు సక్రమంగా తరగతులకు హాజరై కొంచెం కష్టపడినా ఉ త్తీర్ణత సాధించే అవకాశం ఉంది. అయితే విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించలేకపోవడానికి ప లు కారణాలున్నాయని భావిస్తున్నారు. ఇందులో ప్రధానంగా తరగతులకు సరిగా హాజరుకాకపోవ డం. వాస్తవంగా 75శాతం హాజరు ఉండాలనే ని బంధన ఉన్నప్పటికీ ఏ కళాశాలలోనూ అమలు చే యడం లేదు. ప్రభుత్వ కళాశాలలే కాదు ప్రైవేట్‌ క ళాశాలల్లోనూ నాణ్యమైన విద్యనందించడం లేదనే అంశం ఈఫలితాలను బట్టి తెలుస్తోంది. ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో ఎక్కువమంది పేదవర్గాలకు చెందిన వారే ఉంటారు. కొందరు కళాశాలకు అప్పుడప్పుడు వస్తూ కుటుంబ పరిస్థితులు బట్టి ప్రైవేట్‌లో ఉపాధి పొందుతున్న పరిస్థితి కూ డాఉందని తెలుస్తోంది. ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లోనూ విద్యార్థులకు నాణ్యమైన విద్య నందించేందు కు యాజమాన్యాలు సరిపడా బోధనా సిబ్బందిని నియమించుకోవడం లేదు. మూడేళ్లుగా ఫీజు రీ యింబర్స్‌మెంట్‌ రాకపోవడంతో కొన్ని ప్రైవేట్‌ కళా శాలలు సైన్స్‌ విద్యార్థులకు సరిగా ప్రాక్టికల్స్‌ కూడా నిర్వహించడం లేదు. మరోవైపు విద్యార్థులు ఎక్కు వ సమయం సెల్‌లో ముగినిపోవడం కూడా ఉత్తీర్ణతపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.

అటానమస్‌ డిగ్రీ కాలేజీల్లో ఉత్తీర్ణత ఇలా..

అటానమస్‌ కాలేజీల్లో మాత్రం విద్యార్థులు మెరుగై న ఫలితాలు సాధిస్తున్నారు. హనుమకొండ కేడీసీ (అటానమస్‌) డిగ్రీ మొ దటి సెమిస్టర్‌ పరీక్షల్లో 56 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్ర భుత్వ పింగిళి మహిళా కళాశాల మొదటి సెమిస్టర్‌లో 61,93 శాతం, మూడో సెమిస్టర్‌లో 73,27 శా తం, ఐదో సెమిస్టర్‌లో 82.52శాతం ఉత్తీర్ణత సా ఽధించారు. నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సెమిస్టర్‌లో 38,64 శాతం, 3వ సెమిస్టర్‌లో 53.33శాతం ఉత్తీర్ణత సాధించారు. హనుమకొండలోని ఆర్ట్స్‌ కాలేజీ మొదటి సెమిస్టర్‌లో 43, 59శాతం, మూడో సె మిస్టర్‌లో 58,69శాతం, 5వ సెమిస్టర్‌లో 65.04శాతం ఉత్తీర్ణత సాధించారు.

డిగ్రీ మొదటి సెమిస్టర్‌ ఫలితాల్లో 21.93 శాతమే ఉత్తీర్ణత

కేయూ పరిధిలో ఆయా డిగ్రీ కోర్సుల్లో మొత్తం 70,661 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే అందులో 15,495మంది (21.93శాతమే) ఉత్తీర్ణత సాధించారు. బాలురు 36,504మంది పరీలకు హాజరైతే అందులో 5,278మంది (14.46శాతం)ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 34,157మందికిగాను 10,217 మంది 29.91శాతం ఉత్తీర్ణత పొందారు. ఇందులో బాలుర కంటే బాలికలదే పైచేయిగా ఉంది.

డిగ్రీ ఐదో సెమిస్టర్‌ పరీక్షల్లో 40.73 శాతం ..

ఆయా డిగ్రీకోర్సుల్లో మొత్తం 46,828మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా అందులో 19,074 మంది ఉత్తీర్ణత (40.73శాతం) సాధించారు.బాలురు 23,402 మందికిగాను 6,808మంది( 29,09శాతం) ఉత్తీర్ణత, బాలికలు 23,426 మందికిగాను 12,266మంది( 52.36శాతం ) ఉత్తీర్ణత సాధించారు. బాలురకంటే బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంది.

డిగ్రీ మూడో సెమిస్టర్‌లో 28.97శాతం ఉత్తీర్ణత

డిగ్రీ ఆయా కోర్సుల్లో మూడో సెమిస్టర్‌ పరీక్షల్లో మొత్తం 59,916మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా అందులో 17,356మంది ఉత్తీర్ణత (2 8.97శాతం)సాధించారు. బాలురు 29,771మందికి గాను 5,924 మంది (19.90శాతం), బాలికలు 3 0,145 మందికి గాను 11,432మంది (37.92శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలుర కంటే బాలికలే ఎక్కవశాతం ఉత్తీర్ణత పొందారు.

సెమిస్టర్‌ సిస్టంలోనూ మెరుగైన ఫలితాలేవి!

ఇటీవల ఫలితాలు ప్రకటించిన అధికారులు

ఇందులో బాలికలదే హవా..

రీవాల్యుయేషన్‌కు వెల్లువెత్తిన

దరఖాస్తులు

అటానమస్‌ కాలేజీల్లో మెరుగైన ఫలితాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement