గార్ల: ప్రభుత్వ నిబంధనలు పాటించని ఎరువులు, పురుగుమందుల దుకాణాల వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఏఓ విజయనిర్మల హెచ్చరించారు. బుధవారం గార్లలోని పలు ఎరువుల దుకాణాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. దుకాణాల్లో వ్యాపారులు రిజిస్టర్లు, బిల్‌బుక్స్, ఇన్వాయిస్‌లు, లైసెన్స్, ఓఫారంలను సక్రమంగా నిర్వహించకపోతే ఉపేక్షించేది లేదన్నారు. ప్రభుత్వ అనుమతి ఉన్న ఎరువులు, పురుగుమందులనే విక్రయించాలని, గడువు దాటిన మందులను అమ్మితే దుకాణాదారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. డీఏఓ వెంట మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు, ఏఈఓ కిరణ్ తదితరులు ఉన్నారు.