
హేమాచలక్షేత్రంలో భక్తుల సందడి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హే మాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివా రం భక్తుల సందడి నెలకొంది. వివిధ సుదూర ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకునేందు కు భక్తులు వందల సంఖ్యలో తరలిరావడంతో ఆల య ప్రాంగణం కిటకిటలాడింది. ఉదయాన్నే భక్తులు ఆలయానికి చేరుకుని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి గుట్టపై స్వ యంభుగా వెలిసిన హేమాచలున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి తిలతైలాభిషేకం పూజలో పాల్గొని నాభిచందన ప్రసాదాన్ని స్వీకరించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయంలోని నిత్యన్నదానంలో పాల్గొని కుటుంబ సభ్యులతో కలిసి భోజనాలు చేశారు.