
ఎర్రవల్లిచౌరస్తా: బీచుపల్లి క్షేత్రంలోని జ్ఞానసరస్వతి ఆలయంలో బుధవారం వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా అమ్మవారికి సుప్రభాత సేవ, పంచామృత అభిషేకం, కుంకుమార్చనలు, మహా నైవేద్య నీరాజనాలు, వడిబియ్యం వంటి పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలొచ్చిన భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి, సరస్వతీమాతను దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు భువనచంద్రాచారి, దినకరన్ ఆచార్యుల ఆధ్వర్యంలో దాదాపు 200 మంది చిన్నారులతో సామూహికంగా అక్షరాభ్యాసం చేయించారు. గద్వాల మండలం సంగాలకు చెందిన కాంట్రాక్టర్ అయ్యపురెడ్డి కుటుంబ సభ్యులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడంతో పాటు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్‌రాజు తదిత రులు పాల్గొన్నారు.
బీచుపల్లిలో సామూహిక అక్షరాభ్యాసం
Comments
Please login to add a commentAdd a comment