అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

Published Thu, Mar 7 2024 4:45 AM | Last Updated on Thu, Mar 7 2024 9:15 AM

- - Sakshi

అలీపీర్‌ (ఫైల్‌)

మహబూబ్‌నగర్‌: అనుమానాస్ప స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన గద్వాల జిల్లా కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. మానవపాడు మండలం అమరవాయికి చెందిన ఆర్‌ఎంపీ అలీపీర్‌ (42) కొన్నేళ్లుగా పట్టణంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. జీవనోపాధి నిమిత్తం స్థానిక కృష్ణవేణి చౌరస్తాలో క్లినిక్‌ ఏర్పాటు చేసుకున్నాడు.

సోమవారం క్లినిక్‌కు వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పి బయటికి వచ్చాడు. బుధవారం క్లినిక్‌ పైభాగంలో అలీపీర్‌ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రెండు రోజుల కిందట అతడు మృతిచెంది ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తంచేశారు. కాగా, మృతుడు అలీపీర్‌కు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది.

ఈవిషయంపై కొన్ని నెలల కిందట మృతుడి కుటుంబ సభ్యులతో సదరు మహిళ కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ గొడవలే అలీపీర్‌ మృతికి కారణమై ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే సోమవారం నుంచి అదృశ్యమైన అలీపీర్‌ కోసం కుటుంబ సభ్యులు వాకబు చేయకపోవడం, పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మృతదేహంపై బలమైన గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి భార్య అమీనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ టాటాబాబు తెలిపారు.

ఇవి చదవండి: రెండు ఉద్యోగాలు సాధించిన భార్య! అంతలోనే భర్త విషాదం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement