
చట్టాలపై అవగాహనపెంచుకోవాలి
పాలమూరు: ప్రజలు అన్ని రకాల చట్టాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని, ఏదైనా సమస్యలు ఉంటే లోక్ అదాలత్ దృష్టికి తీసుకురావాలని, ఇందులో న్యాయవాదులు సూచనలు, సలహాలు అందిస్తారని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఏనుగొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళ చట్టాలు, లీగల్ సర్వీసెస్ యాక్ట్, పోక్సో యాక్ట్, డీవీసీ, బాలల హక్కులు, బాధ్యతలు, ఫ్రీ లీగల్ ఎయిడ్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని జరీనా బేగం, సౌజన్య, జ్యోతి పాల్గొన్నారు.
గ్రంథాలయాలఅభివృద్ధికి కృషి
అడ్డాకుల: జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం అడ్డాకుల గ్రంథాలయాన్ని పరిశీలించిన ఆయన అక్కడి సౌకర్యాలపై ఆరా తీశారు. భవనం శిథిలావస్థకు చేరడంతో నూతన భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పాఠకులకు కావాల్సిన పుస్తకాలను అందుబాటులో ఉంచే విధంగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి లైబ్రేరియన్ మహేశ్వర్‌రెడ్డి, సిబ్బంది కుర్మయ్య, నాయకులు దశరథ్‌రెడ్డి, సయ్యద్ షఫి, శరత్‌కుమార్‌రెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు.
కందులు క్వింటాల్ రూ.7,999
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి మార్కెట్ యార్డులో బుధవారం కందులు క్వింటాల్ గరిష్టంగా రూ.7,999, కనిష్టంగా రూ.5,666 ధరలు లభించాయి. వేరుశనగ గరిష్టంగా రూ.6,764, కనిష్టంగా రూ.3,052, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,471, కనిష్టంగా రూ.2,435, ధాన్యం హంస గరిష్టంగా రూ.2,221, కనిష్టంగా రూ.1,629, ఆర్‌ఎన్‌ఆర్ గరిష్టంగా రూ.2,693, కనిష్టంగా రూ.1,686, పత్తి గరిష్టంగా రూ.6,739, కనిష్టంగా 5,489, ఆముదాలు రూ.5,940 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్‌లో ఆర్‌ఎన్‌ఆర్ క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,679, కనిష్టంగా రూ.2,609, కందులు గరిష్టంగా రూ.8,159, కనిష్టంగా రూ.7,689గా ధరలు లభించాయి.

చట్టాలపై అవగాహనపెంచుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment