ధర ఎలా ఉంటుందో తెలియదు..
ఉల్లి ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియడం లేదు. ధర బాగా వస్తుందని మార్కెట్‌కు తెస్తే ఒక్కసారిగా పడిపోతున్నాయి. ఒక్కోసారి కూళ్లు, రవాణా ఖర్చులు కూడా చేతికందని పరిస్థితి. వారం వారం ఉల్లి అమ్మకాలు ఉండటంతో ధరలను వ్యాపారులు వేలంలో నిర్ణయిస్తారు.
– రాములు, ఉల్లి రైతు, పోతన్‌పల్లి
ఈ నెలలో ధర లేదు..
నవంబర్ చివరిలో ఉల్లిగడ్డను మార్కెట్‌క తీసుకెళితే క్వింటాకు రూ.2,600 ధర వచ్చింది. నెల రోజుల తర్వాత తీసుకెళ్లిన ఉల్లికి రూ.4,800 ధర పలికింది. ధరలు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితి ఉంది. దిగుబడులు పెరిగితే ధరలు పడిపోతాయి.. తగ్గితే ధరలు పెరుగుతున్నాయి.
– గోపాల్, ఉల్లి రైతు, పల్లెగడ్డ
రైతుకు నష్టం లేకుండా చూడాలి..
ఉల్లి ధరలు ఒడి దుడుకులకు గురవుతుంటాయి. కర్ణాటక, మహారాష్ట్రల నుంచి దిగుమతులు పెరిగితే ఇక్కడ ధరలు తగ్గుతాయి. దిగుబడులు లేకుంటే ధరలు పెరుగుతుంటాయి. ఇలాంటి పరిస్థితి వల్ల రైతులు నష్టాల పాలవుతున్నారు. కనీస ధరలు నిర్ణయించడంతో పాటు ఉల్లి రైతులకు ప్రోత్సాహకాలు ఇచ్చి నష్టాలు రాకుండా చూడాలి.
– సాంబశివుడు, టీయూసీఐ నాయకుడు
●
ధర ఎలా ఉంటుందో తెలియదు..
ధర ఎలా ఉంటుందో తెలియదు..
Comments
Please login to add a commentAdd a comment