ఉత్సాహంగా శోభాయాత్ర
స్టేషన్ మహబూబ్‌నగర్: ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని బుధవారం రాత్రి హిందూవాహిని ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో భారీస్థాయిలో శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బండమీదిపల్లిలోని శివాజీ మహారాజ్ విగ్రహం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర వన్‌టౌన్, రాంమందిర్ చౌరస్తా, క్లాక్‌టవర్, అశోక్‌టాకీస్ చౌరస్తా, ఆర్టీసీ బస్టాండ్, న్యూటౌన్ మీదుగా శెట్టి కాంప్లెక్స్ వరకు నిర్వహించారు. యువత, ప్రజలు ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాజీ చూపిన బాటలో మనమందరం నడుద్దామన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఏపీ మిథున్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ అధ్యక్షుడు వేంరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి, కార్యదర్శి నలిగేశి లక్ష్మినారాయణ, ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు వసంతం వెంకటేశ్, రెబ్బ విఘ్నేష్, శ్రీనివాస్, గురురాజ్, అభిలాష్, కుమార్, సంపత్, రామకృష్ణ పాల్గొన్నారు.
ఉత్సాహంగా శోభాయాత్ర
Comments
Please login to add a commentAdd a comment