జీసీడీఓ తొలగింపుపై విచారణ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్/ రాజాపూర్: కేజీబీవీ జీసీడీఓ రాధను బాధ్యతల నుంచి తొలగించటంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. బుధవారం ‘సాక్షి’లో ‘కేజీబీవీ జీసీడీఓపై వేటు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై రాష్ట్ర విద్యాశాఖాధికారులు సైతం స్పందించారు. డీఈఓ ప్రవీణ్‌కుమార్‌తో పాటు, జీసీడీఓ నుంచి వివరాలు సేకరించారు. ఆమె నియామకం, తొలగింపునకు గల కారణాలు, రాజాపూర్‌లో విచారణ తదితర అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టినట్లు తెలిసింది. ఈక్రమంలో రాజాపూర్ కేజీబీవీలో ఆర్జేడీ విజయలక్ష్మి సైతం విచారణ చేపట్టి విద్యార్థినులకు కలిగిన ఇబ్బందులు, అధ్యాపకులు, ఎస్‌ఓ మధ్య ఉన్న మనస్పర్థలు తదితర అంశాలంపై విచారణ చేపట్టారు. పాఠశాలలోని రికార్డులను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడారు. వారికి వడ్డించే భోజనాన్ని పరిశీలించి కలిసి భోజనం చేశారు. విద్యార్థినులను ఒత్తిడికి గురిచేయవద్దని, వారికి నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాలలో మరోసారి ఏదైనా సమస్య ఉత్పన్నమైతే కఠినచర్యలు హెచ్చరించారు. పాఠశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఎంఈఓ సుధాకర్‌ను ఆదేశించారు. .
డీఈఓను కలిసిన వివిధ సంఘాల నాయకులు
డీఈఓ ప్రవీణ్‌కుమార్‌ను బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగేంధర్‌గౌడ్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి రవికుమార్‌తో పాటు పలు విద్యార్థి సంఘాల నాయకులు కలిశారు. జీసీడీఓను తొల గించేందుకు కారణాలు ఏమిటని ప్రశ్నించారు. బీసీలను అణగదొక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఆమెను తొలగించేందుకు ఎవరి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన డీఈఓ.. రాజాపూర్‌లో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేస్తామని, జీసీడీఓ రాధను కొనసాగించేందుకు సాధ్యసాధ్యాలను పరిశీలిస్తామని, అందుకు ఒక్కరోజు సమయం ఇవ్వాలని ఆయా సంఘాల నాయకులను కోరినట్లు సమాచారం.
డీఈఓ, జీసీడీఓతో వివరాలు సేకరించిన ఉన్నతాధికారులు
రాజాపూర్ కేజీబీవీలో విచారణ చేపట్టిన ఆర్జేడీ విజయలక్ష్మి
జీసీడీఓ తొలగింపుపై విచారణ
Comments
Please login to add a commentAdd a comment