అచ్చంపేట/ అచ్చంపేట రూరల్: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. దోమలపెంట జేపీ బేస్ క్యాంప్ కార్యాలయంలో సహాయక బృందాల అధికారులతో కలెక్టర్, ఎస్పీ వైభవ్, ఇరిగేషన్ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎన్‌డీఆర్‌ఎఫ్ అధికారి సుఖేండు, టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, ఆర్మీ అధికారులు కల్నల్ పరీక్షిత్ మెహ్రా, కల్నల్ అమిత్ కుమార్ గుప్తా, సింగరేణి మైన్స్ రెస్క్యూ అధికారి బలరాం, హైడ్రా అధికారులు, జేపీ కంపెనీ ప్రతినిధులతో టన్నెల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య సిబ్బంది ఆక్సిజన్ అందుబాటులో ఉంచారని, సహాయ చర్యలను మరింత వేగవంతం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment