ఎంఈఓకు నోటీసులు జారీ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: మహమ్మదాబాద్ ఎంఈఓ రాజునాయక్‌కు డీఈఓ ప్రవీణ్‌కుమార్ శుక్రవారం నోటీసులు జారీ చేశారు. విద్యాశాఖలో ప్రైవేటు పాఠశాలలకు అనుమతులివ్వడంపై ‘సాక్షి’లో ఈనెల 20న ‘ఏం జరుగుతుంది’ అనే కథనం ప్రచురితమైంది. జిల్లాలోని ఓ మండలంలో ఎంఈఓ ప్రైవేటు స్కూల్‌కు అనుమతులు ఇచ్చేందుకు డబ్బులు వసూలు చేశారని, ఆన్‌లైన్ చేసేందుకు మరిన్ని డబ్బులు అడిగినట్లు అందులో పేర్కొంది. పద్ధతి మార్చుకోని ఎంఈఓ మహమ్మదాబాద్ మండలంలో ఓ పాఠశాల యాజమాన్యాన్ని డబ్బులు ఇస్తే మరోసారి ప్రక్రియ పూర్తి చేస్తామని ఒత్తిడి తేవడంతో సదరు పాఠశాల యాజమాన్యం ఇటీవలి డీఈఓకు విద్యార్థి సంఘాలతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై డీఈఓ ప్రవీణ్‌కుమార్‌ను వివరణ కోరగా ఎంఈఓ రాజునాయక్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనకు నోటీసులు జారీ చేశామన్నారు. నిర్ణీ త గడువులోగా సమాధానం చెప్పాలని, ఆరోపణలపై సరైన వివరణ ఇవ్వకపోతే ఉన్నతాధికారులకు చర్యలపై సమాచారం ఇస్తామని పేర్కొన్నారు.
మీసేవ కేంద్రాల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు
పాలమూరు: జిల్లాలో ఉన్న మీసేవ కేంద్రాల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో శుక్రవారం హైదరాబాద్ విజిలెన్స్ బృందాలు వేర్వేరుగా పలు మీసేవ కాంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీఎస్పీ ర్యాంకు అధికారుల ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగాయి. ప్రధానంగా ఫిర్యాదులు వచ్చిన వాటిపై ప్రత్యేక దృష్టి సారించి దాడులు చేసి వివరాలు సేకరించారు. ఆదాయం, కులం, బర్త్ సర్టిఫికెట్ల కోసం రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారని ఫిర్యాదుల వచ్చాయి. దీనిపై విచారణ చేసి అధిక ఫీజులు వసూలు చేసే మీసేవ కేంద్రాలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
కొత్త ఉపాధ్యాయులకు శిక్షణ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లా ఇటీవల డీఎస్సీ ద్వారా కొత్తగా నియామకమైన 130 ఎస్జీటీ ఉపాధ్యాయులకు, 8 మంది 2008 డీఎస్సీ ఉపాధ్యాయులకు జిల్లాకేంద్రంలోని బాలికల పాఠశాలలో శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంరీసోర్సుపర్సన్లు అంశాలపై అవగాహన కల్పించారు. డీఈఓ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ కొత్త ఉపాధ్యాయులు జిల్లాలో అక్షరాస్యతను పెంచి మంచి ఫలితాలు రాబట్టేందుకు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులకు అక్షర పరిజ్ఞానం, చతుర్విద ప్రక్రియలను పూర్తిస్థాయిలో పెంచాలన్నారు. కార్యక్రమంలో ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్, సీఎంఓ బాలుయాదవ్, కాంప్లెక్సు హెచ్‌ఎం బాసిత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment