విద్యార్థి మృతదేహం లభ్యం
వెల్దండ: మండలంలోని గుండాల కోనేరులో గల్లంతైన విద్యార్థి ఓమేష్(17) మృతదేహం లభ్యమైంది. రెండో కోనేరులో శుక్రవారం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం మృతదేహాన్ని గుర్తించి వెలికి తీశారు. ఈనెల 26న స్నేహితులతో కలిసి దైవదర్శనానికి వచ్చిన ఓమేష్ కోనేరులో గల్లంతయ్యాడు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ సహకారంతో గురువారం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు గుండాలకు చేరుకున్నాయి. ప్రధాన కోనేరులో విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. శుక్రవారం పక్కనే మరో కోనేరులో ఎన్‌డీఆర్‌ఎఫ్ కమాండో కృష్ణాతర్‌జీ ఆదేశాల మేరకు సిబ్బంది పృథ్వి, మల్లికార్జున్ గాలింపు చేపట్టారు. క్రేన్ సహయంతో ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది కోనేరులోకి వెళ్లి దాదాపుగా 120ఫీట్లతోతులో మృతదేహం ఆచూకీ గుర్తించారు. కోనేరు లోతు ఎక్కువగా ఉండడంతో క్రేన్ సామర్థ్యం సరిపోవడం లేదు. కోనేరులో నుంచి మళ్లీ బయటికొచ్చిన సిబ్బంది అక్కడి పరిస్థితిని వివరించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మరో భారీ క్రేన్ తెచ్చి కోనేరులోకి వెళ్లి గల్లంతైన విద్యార్థి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించినట్లు ఎస్‌ఐ కురుమూర్తి తెలిపారు.
సహాయక చర్యలను పరిశీలించిన ఎమ్మెల్యే..
గుండాల కోనేరులో గల్లంతైన విద్యార్థి ఓమేష్‌ను గుర్తించడానికి ఎన్‌ఆర్‌ఎఫ్ బృందం, పోలీసులు, ఫైర్ సిబ్బంది చేపట్టిన సహాయక చర్యలను శుక్రవారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పరిశీలించారు. కేంద్ర బలగాల కమాండర్ కృష్ణాతార్‌జీను వివరాలను అడిగి తెలుసుకున్నారు.నాయకులు భూపతిరెడ్డి, సంజీవ్‌కుమార్, వెంకటయ్యగౌడ్‌తో కలసి గాలింపు చర్యలను తెలుసుకున్నారు.
రెండో కోనేరులో మృతదేహాన్ని గుర్తించిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నిరసన
లోతు తెలియకనే జాప్యం
గుండాల కోనేరులో గల్లంతైన విద్యార్థి మృతదేహం గుర్తించడంలో జాప్యానికి కారణం కోనేరు తెలియకపోవడమే. ప్రధాన కోనేరులో గురువారం వెళ్లి పరిశీలించాం. అక్కడ విద్యార్థి ఆచూకీ లభించలేదు. రాత్రి కావడంతో గాలింపు చర్యలు నిలిపివేశాం. శుక్రవారం ఉదయాన్నే పక్కనే ఉన్న మరో కోనేరులోకి వెళ్లి చూడగా మృతదేహం లభ్యమైంది. దాదాపుగా 120ఫీట్ల లోతులో మృతదేహం ఉండడంతో భారీక్రేన్ అవసరమైంది. మరో క్రేన్ సహయంతో రెండో కోనేరులోకి వెళ్లి మృతదేహాన్ని వెలికితీశాం. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కోనేరు కావడంతో పరిస్థితిని అంచనా వేయలేకపోయాం. – పృథ్వి,
ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం సభ్యుడు
విద్యార్థి మృతదేహం లభ్యం
విద్యార్థి మృతదేహం లభ్యం
Comments
Please login to add a commentAdd a comment