సమస్యల పరిష్కారమే మజ్లిస్ లక్ష్యం
స్టేషన్ మహబూబ్‌నగర్: కుల, మతాలకతీతంగా పేదల సమస్యలను పరిష్కరించడమే (ఆలిండియా మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమిన్) ఏఐఎంఐఎం లక్ష్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ హాదీ అన్నారు. శనివారం ఆలిండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ఎస్‌బీహెచ్ మెయిన్ బ్రాంచ్ ఎదుట గల పార్టీ కార్యాలయ ఆవరణంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎంఐఎం జిల్లా ప్రధాన కార్యదర్శి జాకీర్ అడ్వకేట్, పట్టణ అధ్యక్షుడు సాధతుల్లా హుస్సేని, నాయకులు ముజంబిల్, జహంగీర్, మహెబూబ్, ముస్తాక్ రషీ ద్, ఇమ్రాన్ షరీఫ్, తాహెర్, మాబూద్, ఫారుఖ్‌అలీ, వహీద్‌సనా, ఇలియాజ్ ముజాహిద్ పాల్గొన్నారు.
పార్టీని బలోపేతం చేస్తాం
జడ్చర్ల టౌన్: నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని పార్టిని బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నామని ఆపార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు జాకీర్ అలి అన్నారు. ఎంఐఎం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జడ్చర్లలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. నాయకులు యాసిర్, జామిద్, ముబీన్, షకీల్, సాబేర్, మౌలానా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment