8న మహిళా శ్రామిక పోరాట దినోత్సవం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళ శ్రామిక పోరాట దినోత్సవంగా జరుపుకుందామని చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కోకన్వీనర్ శ్రీదేవి అన్నారు. మంగళవారం చైతన్య మహిళ సంఘం ఆధ్వర్యంలో పాలమూరు యూనివర్సిటీ ఆవరణలో పోస్టర్‌ను విడుదల చేశారు. ఓటు హక్కు కోసం, కనీస వేతనాలు, పని గంటలను తగ్గించాలని సుదీర్ఘ పోరాటం చేసిన అమరుల త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు, ఉద్యోగస్తులు, శ్రామికులు వారి త్యాగాలను మరిచిపోవద్దన్నారు. కార్యక్రమంలో చైతన్య మహిళా సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కస్తూరి, చంద్రకళ, శివ, మాధురి, సురేష్, సునిత పాల్గొన్నారు.
ట్రాఫిక్ పోలీసులకువినికిడి పరీక్షలు
పాలమూరు: జిల్లా జనరల్ ఆస్పత్రి ఈఎన్‌టీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో వైద్యశిబిరం నిర్వహించారు. జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్‌కుమార్ సింగ్ పర్యవేక్షణలో ఈఎన్‌టీ వైద్య బృందం ట్రాఫిక్ పోలీసులకు వినికిడి సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. మొత్తం 40 మంది పోలీస్ సిబ్బందికి హియరింగ్ పరీక్షలు చేయగా దీంట్లో ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం జనరల్ ఆస్పత్రికి పంపించగా మిగిలిన అందరికి ట్యాబ్‌లెట్స్ అందించారు. కార్యక్రమంలో ఈఎన్‌టీ వైద్యులు మహేశ్వర్‌రెడ్డి, సీఐ భగవంతురెడ్డి సతీష్‌రెడ్డి పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటాల్ రూ.6,620
జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్‌లో మంగళవారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.6,620, కనిష్టంగా రూ.5,191 ధరలు లభించాయి. అనుములు రూ.6,752, ఉలువలు రూ.5,610, రాగులు రూ.3,305, కందులు గరిష్టంగా రూ.6,899, కనిష్టంగా రూ.6,127, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,381, కనిష్టంగా రూ.2,111, ఆముదాలు గరిష్టంగా రూ.6,062, కనిష్టంగా రూ.5,981 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్‌లో ఆముదాలు క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,011, కనిష్టంగా రూ.5,989, కందులు గరిష్టంగా రూ.6,859గా ఒకే ధర పలికింది.
● నారాయణపేట మార్కెట్‌లో వేరుశనగ గరిష్టంగా రూ.6,120, కనిష్టంగా రూ.4930, తెల్ల కుసుమలు క్వింటాల్ రూ.5,259, జొన్నలు గరిష్టంగా రూ.3,706, కనిష్టంగా రూ.3,275, ఎర్ర కందులు గరిష్టంగా రూ.7,469, కనిష్టంగా రూ.5,500, తెల్ల కందులు గరిష్టంగా రూ. 7,589, కనిష్టంగా రూ.6,200 ధర పలికాయి.
సివిల్స్ కోచింగ్‌కుఒప్పందం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: స్థానిక ప్రభుత్వ ఎన్టీఆర్ మహిళా డిగ్రీ–పీజీ అటానమస్ కళాశాలలో చదివే విద్యార్థినులకు సివిల్స్‌లో కోచింగ్ ఇచ్చేందుకు 21వ శతాబ్దపు ఐఏఎస్ అకాడమీ (హైదరాబాద్) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం ఇరుపక్షాల వారు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం 400 మంది విద్యార్థినులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి ఐదేళ్లపాటు యూపీఎస్సీ ఫౌండేషన్ కోర్సులో భాగంగా ఉచిత మాస్టర్ తరగతులు 12 సెషన్స్‌గా ఆఫ్‌లైన్ (ప్రతి సెషన్‌కు రెండు గంటల చొప్పున) లో కోచింగ్ ఇవ్వనున్నారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ.వి.రాజేంద్రప్రసాద్, కెరీర్ గైడెన్స్ సెల్ కన్వీనర్ డా.పద్మ, వైస్ ప్రిన్సిపాల్ అమీనాముంతాజ్ జహాన్, కో–ఆర్డినేటర్ అనిత, 21వ శతాబ్దపు ఐఏఎస్ అకాడమీ చైర్మన్ పి.కృష్ణప్రదీప్, డైరెక్టర్ భవానీశంకర్ తదితరులు పాల్గొన్నారు.
8న మహిళా శ్రామిక పోరాట దినోత్సవం
8న మహిళా శ్రామిక పోరాట దినోత్సవం
Comments
Please login to add a commentAdd a comment