చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
నవాబుపేట: బైక్ అదుపు తప్పి కింద పడి తీవ్ర గాయాలపాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఎస్‌ఐ విక్రమ్ తెలిపారు. గత నెల 27న పత్తేపూర్‌కి చెందిన కమ్మరి శ్రీనివాస్‌చారి(40) అనే వ్యక్తి బైక్‌పై జిల్లా కేంద్రానికి వెళ్లాడు. పని ముగించుకొని తిరిగి ఇంటికి వస్తుండగా కాకర్లపహాడ్ సమీపంలో బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్రగాయాలు కావటంతో స్థానికులు 108 వాహనంలో జిల్లా ఆస్పత్రిలో చేర్పించి కుటుంబీకులకు సమాచారం అందించారు. వారు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడి సోదరుడు కమ్మరి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
కొప్పునూరులో మరొకరు..
చిన్నంబావి: పురుగుమందు తాగి చికిత్స పొందుతూ కోలుకోలేక ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని కొప్పునూరులో చోటుచేసుకున్నట్లు ఎస్‌ఐ జగన్‌మోహన్ తెలిపారు. వివరాలు.. కొప్పనూరుకి చెందిన బంకుమిది నరసింహారెడ్డి (56) అనారోగ్య సమస్యలతో సోమవారం పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కొల్లపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నాగర్ కర్నూలు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
బైక్‌పై నుంచి కిందపడి..
చిన్నచింతకుంట: మోటార్ సైకిల్ అదుపు తప్పి కిందపడి గాయాలపాలై చికిత్స పొందుతూ ఓ వ్యక్తి చెందినట్లు ఎస్‌ఐ రామ్‌లాల్‌నాయక్ తెలిపారు. వివరాలు.. మండలంలోని లక్ష్మీదేవ్‌పూర్‌కి చెందిన పల్లె పాగు ఆనందం(50) ఈ నెల 7న తన బైక్‌పై చిన్నచింతకుంటకు వచ్చాడు. కూరగాయలు తీసుకొని గ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యాడు. మార్గమధ్యలో బైక్ అదుపు తప్పి కిందపడగా ఆనందంకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్ ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మంగళవారం మృతి చెందాడు. మృతుడి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
Comments
Please login to add a commentAdd a comment