ప్రధాన సమస్యలపై దృష్టి
అలంపూర్ రైతులు ప్రధానంగా సాగునీటిని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల ద్వారా పూర్తిస్థాయిలో సాగునీరు అందించడానికి మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తి చేయాలి. అలాగే వంద పడకల ఆస్పత్రిని నిర్మించి ప్రారంభించినా.. ప్రస్తుతం వైద్య సేవలు అందించడం లేదు. దీంతో వైద్యం కోసం ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. అలాగే అసంపూర్తిగా ఉన్న రోడ్ల పనులు పూర్తి చేయాలని, అధ్వానంగా ఉన్న రోడ్ల ఆధునీకరణ అంశాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తాను.
– విజయుడు,
ఎమ్మెల్యే, అలంపూర్
సాగునీరు, విద్య, వైద్యం
గద్వాల నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టు గుడ్డెందొడ్డి జలాశయం సామర్థ్యం పెంపు, ర్యాలంపాడు మరమ్మతుతోపాటు జలాశయం పెంపుపై కూడా ప్రధానంగా ప్రస్తావిస్తాను. అదేవిధంగా మెడికల్ కాలేజీలో స్టాఫ్ నియామకం, జిల్లా ఆస్పత్రిని 500 బెడ్లకు పెంచాలని కోరుతాను. ఇదివరకే దీనిపై పలుమార్లు సీఎం, సంబంధిత మంత్రులు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు వ్యక్తిగతంగా లేఖలు రాశాను. అసెంబ్లీ సమావేశాల్లో వీటిపైనే మరోసారి ప్రస్తావించి ప్రభుత్వ సాయంతో వీటిని సాధించేలా కృషి చేస్తాను.
– బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల
ప్రధాన సమస్యలపై దృష్టి
Comments
Please login to add a commentAdd a comment