నాగుపాముకు చికిత్స
జడ్చర్ల టౌన్: మండలంలోని ఆల్వాన్‌పల్లిలో పట్టుకునే క్రమంలో గాయపడిన నాగుపాముకు సర్ప రక్షకుడు డా.సదాశివయ్య చికిత్స అందించి కాపాడారు. వివరాలు.. ఆల్వాన్‌పల్లిలో నాగుపామును గుర్తించిన యువకులు సర్పరక్షకుడు డా. సదాశివయ్యకు ఫోన్‌ద్వారా సమాచారం అందించారు. దీంతో ఆయన తన శిష్యులైన రాహుల్, రవీందర్ అక్కడికి చేరుకునేలోపు నాగుపాము సమీపంలోని రంధ్రంలోకి వెళ్లింది. దాన్ని తవ్వి పామును బయటకు తీసేందుకు యువకులు గడ్డపారతో తవ్వుతుండగా పాము నడుములో దిగబడింది. అది ఒక్కసారిగా బుసలు కొడుతూ బయటికొచ్చింది. అదిగమనించిన యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. అక్కడికి చేరుకున్న రాహుల్, రవీందర్ చాకచక్యంగా పామును పట్టుకొని జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల జీవ వైవిధ్య సంరక్షణ కేంద్రానికి తీసుకొచ్చారు. అక్కడ డా.సదాశివయ్య పాముకు చికిత్స అందించి కట్టువేసి కాపాడారు. ప్రస్తుతం గాయపడిన పాము ఇదే కేంద్రంలో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment