ముమ్మరంగా సహాయక చర్యలు
అచ్చంపేట/మన్ననూర్: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో జరుగుతున్న సహాయక చర్యలకు రోబోలను ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు మంగళవారం ఉదయం హైదరాబాద్‌కు చెందిన అన్వి రోబోటిక్స్ సంస్థకు చెందిన ఏఐ బేస్డ్ కెమెరా సదుపాయం గల రోబోటిక్‌లను తీసుకెళ్లారు. సంస్థ ప్రతినిధులు విజయ్, అక్షయ్ లోకో ట్రైన్‌లో సొరంగంలోకి వాటిని తీసుకెళ్లారు. అన్వి రోబోటిక్ సంస్థకు చెందిన ప్రతినిధులు టన్నెల్ దగ్గర ఆఫీసులో కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాట్లను ప్రారంభించారు. ప్రమాద ప్రదేశంలో చేపట్టే సహాయక చర్యల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకుండా రోబోలను ఉపయోగించుకుంటున్నట్లు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్ తెలిపారు. సహాయక చర్యల్లో కావాల్సిన సామగ్రితోపాటు సహాయక బృందాలు మరోమారు కాడవర్ డాగ్స్ ప్రమాద ప్రదేశానికి వెళ్లాయని తెలిపారు. సమావేశంలో ప్రస్తుత సహాయక చర్యల పురోగతిని సమీక్షించి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. టన్నెల్ సహాయక చర్యలలో అనుసరించాల్సిన విధివిధానాలు, రోబోటిక్స్, మెకానికల్ పరికరాల వినియోగం, మట్టి తొలగింపు ప్రక్రియ, భద్రతా చర్యలపై విస్తృతంగా చర్చించిన అధికారులు సహాయక చర్యలను మరింత వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. సమావేశంలో కలెక్టర్ బదావత్ సంతోష్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అన్వి రోబోటిక్స్, హైడ్రా, ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, సింగరేణి, ర్యాట్ మైనర్స్, దక్షిణ మధ్య రైల్వే తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లోకి
రోబోటిక్ సంస్థ ప్రతినిధులు
కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాట్లు
ముమ్మరంగా సహాయక చర్యలు
Comments
Please login to add a commentAdd a comment