లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
కోస్గి: స్కానింగ్ కేంద్రాల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్యశాఖ అధికారి డా. జయంతిరెడ్డి హెచ్చరించారు. మంగళవారం పట్టణంలోని పలు స్కానింగ్ కేంద్రాలను జిల్లా వైద్యాధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. స్కానింగ్ చేసే వారి వివరాలు విధిగా సమగ్రంగా నమోదు చేయాలని, ఆధార్‌కార్డు, పూర్తి చిరునామా, స్కానింగ్ తీయడానికి గల కారణాలు ఉండాలని సూచించారు. రేడియాలజిస్టులే స్కానింగ్ తీయాలన్నారు. ఆమె వెంట జిల్లా ఉప వైద్యాధికారి డా. శైలజ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment