కార్డియాలజిస్ట్‌లు అందుబాటులో ఉండాలి
పాలమూరు: కార్డియో(గుండె) రోగులకు క్రమం తప్పకుండా గుండె వైద్యులు(కార్డియాలజిస్ట్) అందుబాటులో ఉండేలా జనరల్ ఆస్పత్రి అధికారులు చూడాలని అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆదేశించారు. మంగళవారం జిల్లా జనరల్ ఆస్పత్రిలో ప్రైవేట్ గుండె వైద్యులతో పాటు ఐఎంఏతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిలో అతి త్వరలో రోజు విడిచి రోజు కార్డియాలజీ సేవలు, 2డీ ఎకో స్కానింగ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. దీనికి పట్టణంలోని ఆరుగురు ప్రైవేట్ గుండె వైద్యుల సేవలు వినియోగించుకోవాలన్నారు. 15 మంది రోగులకు స్కానింగ్‌తో పాటు ఓపీ సేవలు అందించాలన్నారు. ఈ వారం రోజుల్లో గుండె ఓపీ సేవలు ప్రారంభమయ్యేలా చూడాలని సూచించారు. సదరం క్యాంపు నిర్వహణ కోసం అర్థో విభాగం భవనం పరిశీలించి ఇకపై సదరం శిబిరం ఇక్కడే నిర్వహించి అర్థో కేసులు ఇక్కడే పరిశీలించాలన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.సంపత్‌కుమార్ సింగ్, ఐఎంఏ అధ్యక్షుడు డా.రాంమోహన్, డా.శ్యామూల్ తదితరులు పాల్గొన్నారు.
రోజు విడిచి రోజు కార్డియో వైద్యసేవలు
అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్
Comments
Please login to add a commentAdd a comment