దేవరకద్ర రూరల్: విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం కౌకుంట్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనంలో కూరగాయలు నాణ్యతగా లేకపోవడం గమనించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. స్నాక్స్‌గా రోజు రాగిజావ అందిస్తున్నారని కలెక్టర్‌కు విద్యార్థులు చెప్పడంతో మెనూ ప్రకారం ఇవ్వకుండా రాగి జావ ఇవ్వడమేమిటని ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని తహసీల్దార్, ఎంపీడీఓలను ఆదేశించారు. తరగతి గదుల్లో పాఠ్యాంశాలకు సంబంధించి విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. కౌకుంట్ల నూతన మండలం కావడంతో, కార్యాలయాలు, ప్రభుత్వాస్పత్రి నిర్యాణానికి గ్రామంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. అంతకుముందు పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంపీడీఓ ఆఫీస్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. తహసీల్దార్ రెహమన్, ఎంపీడీఓ శివప్రసాద్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
కలెక్టర్ విజయేందిర బోయి
స్నాక్స్‌గా రాగి జావ ఇవ్వడంపై ఉపాధ్యాయులపై ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment